Begin typing your search above and press return to search.

మీరు కాల్చి చంపండి..నేను మ‌ద్ద‌తిస్తాను:రేవంత్

By:  Tupaki Desk   |   28 July 2017 1:21 PM GMT
మీరు కాల్చి చంపండి..నేను మ‌ద్ద‌తిస్తాను:రేవంత్
X
టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇటీవ‌లి కాలంలో త‌న దూకుడు పెంచేస్తున్నారు. అయితే ఆయ‌న విమ‌ర్శ‌లు కాస్త శృతి మించుతున్నాయ‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో తాజా ఉదాహ‌ర‌ణ‌గా రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ భ‌వ‌న్‌లో చేసిన కామెంట్ల‌ను చెప్పుకోవ‌చ్చు. తాజాగా హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి మాదక ద్రవ్యాల మహమ్మారి రాష్ట్రంలో అన్ని వర్గాలను పట్టిపీడిస్తుంటే కొన్ని సంస్థలు, వ్యక్తులను బాద్యులను చేసి చూపిస్తున్నార‌ని ఆక్షేపించారు. విచారణ సంస్థల తీరు తెలంగాణలో ప్రజలను ఆవేదన - నిరాశను కల్పిస్తున్నాయని అన్నారు. డ్ర‌గ్స్ దందా బంద్ అని సీఎం కేసీఆర్ చెప్పారని అయితే డ్ర‌గ్స్ మాఫియాతో పాలకులు - వారి కుటుంబాలకు సంబంధం ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

గ‌త 60 సంవత్సరాల్లో 56 పబ్ లకు అనుమతి ఇస్తే..టీఆర్ ఎస్ స‌ర్కారులో ఒక్క మూడు సంవత్సరాల్లో 57 పబ్ లకు అనుమతి ఇచ్చార‌ని రేవంత్ రెడ్డి ఆరోపించారు. జూబ్లీహిల్స్ - బంజారాహిల్స్ - మాదాపూర్ లో నివాసం ఉండటం అంటే ధనికులు అని చెప్పేవారని అయితే ఇప్పుడు అవి డ్రగ్స్ - పబ్స్ కు అడ్డాగా మారాయని విమ‌ర్శించారు. ఒకప్పుడు గోవా వంటి పర్యాటక ప్రాంతాల్లో ఇలాంటి మ్యూజికల్ నైట్స్ ఉండేవని ముంబై - గోవాలో ఇలాంటి కార్యక్రమాలు రద్దు చేస్తే హైద‌రాబాద్ మాత్రం దానికి వేదిక‌గా నిలిచింద‌న్నారు. డేవిడ్ గుట్యా లాంటి వాళ్ళకు తెలంగాణ రాష్ట్రం అనుమతి ఇచ్చారని తెలిపారు. మంత్రి కేటీఆర్ అనుమతి ఇస్తే, ఆయన బావమరిది టిక్కెట్లు అమ్మకాలు చేసుకుంటున్నార‌ని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంలోని పర్యాటక శాఖ సన్ బన్ కార్యక్రమానికి డబ్బులు ఖర్చు చేసిందని రేవంత్ రెడ్డి తెలిపారు.

కేటీర్ బావ మరిది ఈవెంట్స్ నౌ అనే పేరుతో ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నార‌ని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ బావ‌మ‌రిది పేరు రాజేంద్రప్రసాద్ పాకాల అని అయితే రాజ్ పాకాల పేరుతో ఆయ‌న పాపుల‌ర్ అని తెలిపారు. రాజ్ పాకాల‌ ఆయన సతీమణి డీజే షోల వ్యాపారం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కుటుంబమే ప్రత్యక్ష మాదక ద్రవ్యాల వ్యాపారంలో ఉందని ఇక దర్యాప్తు సంస్థలు విచారణ ఎలా జరుపుతాయని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. సీఎం కేసీఆర్ మనవడు చదివే పాఠశాలలో మాదక ద్రవ్యాలు విక్రయిస్తుంటే సమాజం ఎటు పోతుందని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. ``రాష్ట్రంలో ఇంత జరుగుతున్నప్పుడు ఈ కుర్చీలో కూర్చునే నైతికత ఉందా? సీఎం కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు. నీ కొడుకు బావమరిది వ్యాపారం చేస్తుంటే నిఘా వ్యవస్థ ఏమైంది. టూరిజం శాఖ ఇలాంటి ఒప్పందాలు చేసుకుంటుంటే సీఎం ఏం చేస్తున్నారు. ముఖ్యమంత్రికి ఇలాంటివి తెలిసి జరుగుతున్నాయా? తెలియకుండానా?`` అని రేవంత్ రెడ్డి ప్ర‌శ్న‌ల వ‌ర్షం గుప్పించారు.

మంత్రి కేటీఆర్ ప్ర‌తిరోజూ సాయంత్రం 7 గంటల తరువాత బ‌య‌టికి వె ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పాల‌ని రేవంత్ రెడ్డి అన్నారు. ``కేటీఆర్ కు ఉన్న బలహీనతలు ఏంటీ? ఆయన బలహీనతలు తెలుసుకుని ఆడిస్తున్న రాజులు ఎవరు? సీఎం సమాచారం తెప్పించుకోలేరా? సైబరాబాద్ పోలీసులు ఏం చేస్తున్నారు. మాదక ద్రవ్యాలు విక్రయించే వారిని ఎన్ కౌంటర్ చేయాల‌ని పోలీసుల‌కు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అలా ఎన్‌కౌంట‌ర్ చేస్తే తాము మ‌ద్ద‌తు ఇస్తామ‌న్నారు.