Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ లో చిచ్చురేపుతున్న ఉప ఎన్నిక...!
By: Tupaki Desk | 18 Sep 2019 1:23 PM GMTహుజూర్ నగర్ ఉప ఎన్నికల పోరు ఇప్పుడు కాంగ్రెస్ లో చిచ్చు రేపుతుంది. అసలే కష్ట కాలంలో ఉన్న కాంగ్రెస్ కు నేతలంతా ఒకతాటిపైకి వచ్చి ఐకమత్యంతో ఉండి - ఉప ఎన్నికల పోరులో విజయం సాధించాల్సింది పోయి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారారు. కాంగ్రెస్‌లో వర్గ పోరాటాలకు - గ్రూపు తగాదాలకు కొదువ ఉండదు. అయితే ఇప్పుడు హూజూర్ నగర్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ లో కొత్త తగాదాలకు దారి తీస్తుంది.
కాంగ్రెస్‌లో హూజూర్ నగర్ ఉప పోరు కాంగ్రెస్ లో పోరుకు లేపింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ ఎంపీగా ఎన్నిక కావడంతో హూజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆ సీటు ఖాళీ అయింది. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది. అయితే పీసీసీ నేత ఉత్తమ్ ఈ ఉప పోరులో తన భార్య పద్మావతిని ఎంపిక చేసుకుని ముందుకు పోతున్నాడు. అయితే అధికారికంగా అధిష్టానం అభ్యర్థిగా పద్మావతిని ప్రకటించకున్నా పీసీసీ హోదాలో తానే స్వయంగా ప్రకటించుకోవడం ఇప్పుడు కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయానికి తెరలేచింది.
పీసీసీ అధ్యక్షుడు తన భార్యనే ప్రకటించుకోవడంతో మల్కాజ్ గిరి ఎంపీ - కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి కోదాడ అభ్యర్థిగా ఓడిపోయారు. ఆమెను ఎలా ? హుజూర్ నగర్ అభ్యర్థిగా ప్రకటిస్తారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయితే రేవంత్ రెడ్డి కూడా ఓ కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే చామల కిరణ్ రెడ్డికి మద్దతు ఇస్తున్నాడు.
ఇప్పుడు స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు తన భార్యను - వర్కింగ్ ప్రెసిడెంట్ మరో అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తుండటంతో కాంగ్రెస్‌లో అభ్యర్థి ఎవరనేది ? చర్చనీయాంశంగా మారింది. పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిందనే సామేత గా మారింది కాంగ్రెస్ పరిస్థితి. కాంగ్రెస్‌లోని కయ్యాలు అధికార టీ ఆర్ ఎస్ కు లాభం కలిస్తాయని కాంగ్రెస్ లోని నేతలే అభిప్రాయపడుతున్నారు. ఈ హూజూర్ నగర్ పోరు ఎటువైపు దారి తీస్తుందో.. అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారో వేచి చూడాల్సిందే.