Begin typing your search above and press return to search.

రేవంత్ బయటపడ్డారు

By:  Tupaki Desk   |   30 Jun 2015 5:22 AM GMT
రేవంత్ బయటపడ్డారు
X
ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి హై కోర్టులో ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై న్యాయస్థానంలో విచారణ జరిగింది. రూ. 5 లక్షల పూచికత్తుతో రేవంత్‌రెడ్డికి న్యాయస్థానం బెయిల్‌ మంజూరీ చేసింది.

ఈ రోజు ఉదయం ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ మొదలైంది. తెలంగాణ ఏసీబీ లిఖితపూర్వకంగా మరిన్ని వాదనలను న్యాయస్థానానికి సమర్పించింది. తెలంగాణ ఏసీబీ పక్షాన ఏజీ రామకృష్ణ వాదనలు వినిపించారు. రేవంత్‌ రెడ్డి బెయిల్‌పై ఆయన న్యాయస్థానం ముందు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు విచారణలో ఉన్నందున బెయిల్‌ ఇవ్వకూడదని, బెయిల్‌ మంజూరీ అయితే కేసు తారుమారయ్యే అవకాశం ఉందని ఏజీ వాదించారు. తెలంగాణ ఎజి రామకృష్ణారెడ్డి చార్జీషీట్ వేసిన తర్వాత బెయిల్ ఇస్తే అభ్యంతరం లేదని, ఈలోగా ఇస్తే కేసు విచారణకు ఆటంకం ఏర్పడుతుందని వాదించారు. ఈ కేసులో నాలుగున్నర కోట్ల డబ్బు ఎక్కడ ఉందో తెలియవలసి ఉందని, పోరెన్సిక్ నివేదిక ఆదారంగా మరికొందరిని విచారించివలసి ఉందని అన్నారు.కేసులో నిందితుడు అయిన జెరుసలెం మత్తయ్య పరారీలో ఉన్నాడని, ఈ పరిస్థితిలో రేవంత్ బయటకు వస్తే కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. అయినప్పటికీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడానికి జడ్జి మొగ్గు చూపారు. ఇప్పటికే విచారణ జరిగిందని, ఎప్ ఎస్ ఎల్ నివేదిక వచ్చిందని అందువల్ల బెయిల్ ఇవ్వవచ్చని బావించి, ఎజి వాదనతో ఏకీభవించకుండా రేవంత్ కు షరతులతో కూడిన బెయిలును రేవంత్ కు మంజూరు చేశారు. రేవంత్ తన నియోజకవర్గాన్ని దాటి వెళ్లరాదని షరతు పెట్టారు. కాగా గత ముప్పై రోజులుగా జైలులో ఉన్న రేవంత్ కు ఇది గొప్ప ఊరటగానే చెప్పాలి.

కాగా నిన్న స్టీఫెన్సన్ కు హైకోర్టులో చుక్కెదరవడం... తాజాగా రేవంత్ కు బెయిలు రావడంతో పరిస్థితులు టీడీపీ వైపు అనుకూలంగా మారుతున్నట్లుగా భావిస్తున్నారు.