Begin typing your search above and press return to search.

చివ‌రి సారి..బాబు వ‌ద్ద రేవంత్ క‌న్నీళ్లు

By:  Tupaki Desk   |   28 Oct 2017 1:25 PM GMT
చివ‌రి సారి..బాబు వ‌ద్ద రేవంత్ క‌న్నీళ్లు
X
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించి గ‌త కొద్దికాలంగా తెర‌మీద‌కు వ‌చ్చిన అంచ‌నా నిజ‌మ‌యింది...తెలంగాణ టీడీపీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు - ఫ్లోర్ లీడ‌ర్ హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి త‌న ప‌ద‌వుల‌కు..గుర్తింపునిచ్చిన తెలుగుదేశం పార్టీకి...గుడ్ బై చెప్పేశారు. అయితే ఈ సంద‌ర్భంగా అమ‌రావ‌తి కేంద్రంగా జ‌రిగిన చివ‌రి స‌మావేశంలో టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు - రేవంత్ మ‌ధ్య ఏం జ‌రిగింద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

తెలుగుదేశం పార్టీకి సంబంధించి వ‌స్తున్న స‌మాచారం ప్ర‌కారం... అమ‌రావ‌తిలో తెలంగాణ టీడీపీ నేతల సమావేశం సీరియస్ గా జరుగుతోంది. ఈ సంద‌ర్భంగా రేవంత్ పార్టీ మార్పులు...ఇత‌ర‌త్రా రాజకీయ విషయాలు - కాంగ్రెస్ తో శత్రుత్వం - ఏపీ ప‌రిణామాలు తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయ్ వంటి అన్నీ మాట్లాడుతున్నారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు జోక్యం చేసుకొని...``లంచ్ తర్వాత మళ్లీ కూర్చుందాం.ఓ ఐదుగురు నేతలు ఎవరో మీరే తేల్చుకొని సిద్ధంగా ఉండండి`` అంటూ బాబు లేచి లోపలికి వెళ్లారు. ఈ స‌మ‌యంలోనే....బాబుతో పాటు తలుపు తోసుకొని చొరవగా రేవంత్ కూడా ఎంటర్ అయ్యాడని స‌మాచారం.

అలా చొర‌వ‌గా లోప‌లికి వెళ్లిపోయిన రేవంత్ రెడ్డి టీడీపీ అధినేత‌ చంద్రబాబును చూస్తుండిపోయాడట‌... `ఏంటి?` అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించ‌గా రేవంత్ పార్టీలో పరిస్థితులు ముందు ఓ రెండు నిమిషాలు వివరించారు. ఈ సంద‌ర్భంగా తాను పార్టీని వీడాలనుకుంటున్నట్టు చెప్పాడు. ``కాంగ్రెస్ పై మీ వ్యతిరేకత నాకు తెలుసు అంటూనే...తప్పనిసరి పరిస్థితుల్లో ఇక కాంగ్రెస్ లోనే చేరాలనుకుంటున్నాను`` అంటూ తన వాదన వినిపించాడు. మిగతా వ్యక్తిగత విషయాలు కూడా కొద్ది నిమిషాలు మాట్లాడుకున్నారు. అంతా విన్న తర్వాత `వెళ్లిపోతావా?` అని చంద్రబాబు రేవంత్ తో అన్నట్లు స‌మాచారం. ఈ సంద‌ర్భంగా రేవంత్ కళ్లల్లో నీళ్లు తిరుగుతూ ``అవును సర్ - మీతో చెప్పిన తర్వాతే వెళ్తున్నా`` అంటూ రిప్లై ఇచ్చి రేవంత్ అక్క‌డి నుంచి క‌దిలిపోయాడ‌ని స‌మాచారం. దీంతో...చంద్రబాబు మౌనంగా ఉండిపోయారు. రేవంత్ వచ్చి కారెక్కేశాడని స‌మాచారం. విషయం బైటకి బ్రేకింగ్ లా వచ్చింది.

అనంత‌రం త‌న‌ను క‌లిసిన కొంద‌రు మీడియా మిత్రుల‌తో....`` చంద్రబాబుకి చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పాను. నేను ఎప్పుడూ ఆయన మనిషినే. ఢిల్లీలో అయినా ఆ సంగతి చెప్తాను. నేను టైమ్ వేస్టు చేసుకోదల్చుకోలేదు. ఎవరి మీదా నాకు ఇప్పుడు ఒపీనియన్ లేదు`` అంటూ టీటీడీపీ తగవుల్ని తేలిగ్గా కొట్టేశాడు.