Begin typing your search above and press return to search.
టీఆర్ఎస్, బీజేపీ నేతలు టచ్ లో ఉన్నారు: రేవంత్ రెడ్డి
By: Tupaki Desk | 14 July 2021 12:30 AM GMTహుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉంటూ టీఆర్ఎస్ టికెట్ నాదేనని బుక్కైన కౌశిక్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేయడం.. రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. కాంగ్రెస్ ఇన్ చార్జి మణిక్కం ఠాగూర్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పీసీసీని రేవంత్ కొన్నాడని.. మణిక్కం ఠాగూర్ అమ్ముకున్నాడని కౌశిక్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు.
ఈ ఆరోపణలపై తాజాగా ఏఐసీసీ ఇన్ చార్జి మణిక్కం ఠాగూర్ మండిపడ్డారు. తనపై చేసిన ఆరోపణలకు పాడి కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి మణిక్కం ఠాగూర్ కు 50 కోట్ల రూపాయలు ఇచ్చి రేవంత్ రెడ్డి పదవి కొన్నారని కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి చంద్రబాబు పాదాల దగ్గర పెట్టబోతున్నాడంటూ విమర్శించారు. ఈ క్రమంలోనే తనపై చేసిన ఆరోపణలకు వారం రోజుల్లో భేషరతుగా లిఖిత పూర్వకంగా క్షమాపణ చెప్పాలని లీగల్ నోటీసులో మాణిక్కం ఠాగూర్ పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేశారని.. దీనిపై లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వకుంటే ఒక కోటి రూపాయల పరువు నష్టం దావా వేస్తామని.. చట్టపరమైన చ్యలు తీసుకుంటామని మణిక్యం హెచ్చరించారు.
ఇక కౌశిక్ రెడ్డి వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా స్పందించాడు.కౌశిక్ రెడ్డి వ్యవహారం తనకు ముందే తెలుసు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే హుజూరాబాద్ నియోజకవర్గంలో మంచి అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీతో టచ్ లో ఉన్నాడని తనకు సమాచారం ఉందని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ నుంచి కౌశిక్ రెడ్డికి టికెట్ ఇస్తారని తాను అనుకోవడం లేదని రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ ఎంతగా ప్రచారం చేసినా వారికి అభ్యర్థి కరువయ్యాడని రేవంత్ పేర్కొన్నారు.
టీఆర్ఎస్,బీజేపీకి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారని.. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రెండు మూడురోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులను నియమిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో ఇంటి దొంగలను వదిలిపెట్టం అని తేల్చిచెప్పారు.