Begin typing your search above and press return to search.
జగ్గారెడ్డి వివాదం రేవంత్ ఆచి తూచి అడుగులు రీజనేంటి
By: Tupaki Desk | 22 Feb 2022 3:30 AM GMTసంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి వ్యవహారంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందిం చారు. జగ్గారెడ్డి ఇష్యూ పార్టీ దృష్టికి వచ్చిందని.. సీనియర్ నేతలు ఆయనతో మాట్లాడుతున్నారని తెలిపా రు. జగ్గారెడ్డి తమ నాయకుడని.. పార్టీ అధిష్ఠానం అపాయింట్మెంట్ కోరారని చెప్పారు. ఆయనకు తామం తా అండగా ఉంటామని అన్నారు.
సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్ట్లు వచ్చాయని కుంగిపోవద్దని సూచించారు. మూడు రోజుల నుంచి జగ్గారెడ్డి చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. మేడారంలో ఈ అంశం పై మాట్లాడిన రేవంత్ .. దీనిని కుటుంబ సమస్యగా పేర్కొన్నారు.
అంతేకాదు.. టీ కప్పులో తుపానులా తేలిపోతుందన్నారు. అయితే.. రేవంత్ ఇలా చెబితే.. తర్వాత కూడా జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో వరుసగా రెండో రోజు కూడా రేవంత్ జగ్గారెడ్డి విషయంపై మీడియాతో మాట్లాడారు.
తనపై కూడా సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెట్టారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇలాంటి విషయంలో మనోధైర్యంతో బలంగా ఉండాలని అన్నారు. మనం మానసికంగా కృంగిపోతే శత్రువులు మరింత విజృంభిస్తారని చెప్పారు. జగ్గారెడ్డిపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
గతంలోనూ వీహెచ్పై కూడా ఇలాగే సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని చెప్పారు. ఆరా తీస్తే కౌశిక్ రెడ్డి అనుచరుడని తేలిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జగ్గారెడ్డి తనకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడని... తాను రాజకీయాల్లోకి రాకముందు కూడా పరిచయం ఉందని చెప్పారు.
జగ్గారెడ్డి ఇష్యూ .. తమ కుటుంబ సమస్య అని.. అందరం కూర్చొని మాట్లాడుకుంటామని రేవంత్ రెడ్డి అన్నారు. పీసీసీ చీఫ్గా కొన్ని బయట మాట్లాటలేనని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావడానికి తాము అందరం కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. జగ్గారెడ్డి విషయంలో పార్టీ పూర్తిగా అండగా ఉంటదని స్పష్టం చేశారు.
జగ్గారెడ్డి, వీహెచ్‌తో తమ పార్టీ పెద్దలు చర్చిస్తున్నారని రేవంత్ చెబుతున్నారు. వివాదం సద్దు మణిగిపోతుందని రేవంత్ నమ్మకంగా ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
పీసీసీ చీఫ్‌గా అందర్నీ కలుపుకుని పోతున్నానని ఎంత చిరాకు పెట్టినా తాను విమర్శలు చేయడం లేదని.. చివరికి హైకమాండ్‌కు ఫిర్యాదులు కూడా చేయడం లేదని ఆయన అందరికీ తెలిసేలా చేస్తున్నారు. మొత్తంగా చూస్తే రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పై పోరాడుతూంటే .. ఆయనకు చికాకులు కల్పించేందుకు జగ్గారెడ్డి, వీహెచ్ ప్రయత్నిస్తున్నారన్న భావన మాత్రం అందరిలోనూ ఏర్పడుతోంది.