Begin typing your search above and press return to search.
కేసీఆర్ తిట్లు వాళ్లందరినీ ఒక్కటి చేశాయిగా!
By: Tupaki Desk | 3 Aug 2017 10:30 AM GMTఒకింత గ్యాప్ తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడిన తెలంగాణ సీఎం కేసీఆర్ తనదైన శైలిలో విపక్షాలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మొదలుకొని టీడీపీ - వామపక్షాలు - ప్రజాసంఘాలు ఇలా అందరిపై కేసీఆర్ దుమ్మెత్తిపోశారు. ఒక దశలో పరుషపదాలు సైతం ఉపయోగించారు. కేసీఆర్ తనదైన శైలిలో చెలరేగిపోయిన తీరుపై ఆయా పార్టీల విపక్ష నేతలు విరుచుకుపడ్డారు. వేర్వేరుగా నిర్వహించిన విలేకరుల సమావేశాల్లో సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి - టీడీపీ కార్యానిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి - సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇలా విపక్ష నాయకులంతా ఒకే టోన్ తో కేసీఆర్ పై దుమ్మెత్తిపోశారు.
హుందాగా వ్యవహరించడానికి పెట్టింది పేరయిన సీఎల్పీ నేత జానారెడ్డి సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నా కొడుకులు అని కేసీఆర్ చేసిన వాఖ్యలు వింటే బాధేస్తుందని అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇష్టానుసారంగా పాలన చేస్తానంటే కుదరదని పేర్కొంటూ విపక్ష పార్టీగా ప్రజల పక్షంలో తమ గళం వినిపిస్తామని స్పష్టం చేశారు. కోర్టుకు వెళ్లిన వారిని కాంగ్రెస్ నేతలు పేర్కొనడం సరికాదని కడుపు మండినవారే న్యాయస్థానానాలను ఆశ్రయిస్తున్నారని జానారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి, టీఆర్ ఎస్ పార్టీ తీరును ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు.
టీడీపీ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దుర్యోధనుడిని మరిపించే అహంకారంతో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నయిమ్ కేసు, మియాపూర్ భూములు - డ్రగ్స్ వ్యవహారం - నకిలీ విత్తనాలు తదితర అంశాల గురించి నోరు మెదపని సీఎం తనకు నచ్చిన అంశంలో విరుచుకుపడ్డారు. దళితుల మెడలో బోర్డ్ లు ఉంటాయా అని మాట్లాడటం దారుణమని అన్నారు. ప్రతిపక్ష రాజకీయ నేతలను కించపరిచి మాట్లాడటం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని ఆరోపించారు. ఇసుక మాఫియా కారణంగా చనిపోయిన దళితుల కుటుంబానికి 20లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్టులను కేసీఆర్ దుర్భాషలాడడం నీచమైన చర్య అని ఆక్షేపించారు. కమ్యూనిస్టులు ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్నారని, వాళ్ళు లేని తెలంగాణ సమాజాన్ని ఉహించలేనిదని రేవంత్ ప్రశంసించారు. హిమాన్షు మోటార్స్ లో లక్ష షేర్లు ఉన్నట్టు 2014 ఎన్నికల ఆఫిడవైట్ లో కేటీఆర్ చూపించారని అన్నారు. కేటీఆర్ స్వయంగా హిమాన్షు మోటార్స్ తో వ్యాపార లావాదేవీలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు.
కమ్యూనిస్టులు ఓట్లు-సీట్ల పరంగా బలహీనంగా ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.కమ్యూనిస్టులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఎన్నో త్యాగాలు చేసి ప్రజల తరపున నిరంతరం పోరాడే కమ్యూనిస్టుల చరిత్ర తెలుసుకోవాలని కేసీఆర్ కు సూచించారు. 2004-2009-2014 ఎన్నికల్లో కమ్యూనిస్టు లో గొప్పవాళ్ళు, నిజాయితీ పరులు అని పొగిడి పొత్తు కోసం కేసీఆర్ వెంపర్లాడారని...నేడు కమ్యూనిస్ట్ లు ఎక్కడ ఉన్నారని, దిగజారుతున్నారని అహంభావంగా మాట్లాడుతున్నారని తమ్మినేని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పేద ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయలేదని అన్నారు. ప్రభుత్వ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితుల పై థర్డ్ డిగ్రీ ప్రయోగించి, చిత్ర హింసలు పెట్టిన సిరిసిల్ల ఘటనను కేసీఆర్ సమర్తిస్తుండటం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు.