Begin typing your search above and press return to search.
ఎన్నారైలను ఫిదా చేసే డిమాండ్ చేసిన రేవంత్
By: Tupaki Desk | 12 July 2017 4:43 PM GMTతెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రజలను ఆకట్టుకునే ప్రసంగం చేయడంలో ఉన్న సత్తా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆకట్టుకునే పిట్టకథలు, సందర్భోచిత కామెంట్లతో రేవంత్ కు ప్రాంతాలకు అతీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇలా మాటల ద్వారా పాపులర్ అయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కొత్త డిమాండ్ ద్వారా అగ్రరాజ్యం అమెరికన్ల మనసు దోచుకునేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నారైలకు సంబంధించిన మనసును గెలిచే డిమాండ్ ఒకటి చేశారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని డెట్రాయిట్ - డల్లాస్ ప్రాంతాలలో నివసిస్తున్న తెలుగు ప్రజల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసులను ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్ర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతి రాజుకు ఈ మేరకు బుధవారం ఒక లేఖను రాశారు.
నార్త్ అమెరికా తెలుగు సొసైటి (నాట్స్) ఆధ్వర్యంలో నిర్వహించిన అమెరికా తెలుగు సంబరాలు కార్యక్రమాలలో పాల్గొనడానికి అమెరికా వెళ్లిన రేవంత్ తన పర్యాటన ముగించుకొని మంగళవారం రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు. అనంతరమే ఈ లేఖ రాశారు. తన పర్యటనలో డెట్రాయిట్ - డల్లాస్ ప్రాంతాలలో నివసిస్తున్న వేలాది తెలుగు కుటుంబాలను తాను కలవడం జరిగిందని చెప్పారు. ఎయిర్ ఇండియా అన్ని ప్రాంతాలకు సమర్థవంతంగా సేవలను అందిస్తున్నప్పటికి తమ ప్రాంతాలకు హైదరాబాద్ నుంచి నేరుగా రావడానికి విమాన సర్వీసులు లేవని చెప్పారని తెలిపారు. ముఖ్యంగా వయోవృద్దులు - పిల్లలతో ప్రయాణాలు చేయడం ఇబ్బందికరంగా మారిందని తమ దృష్టికి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి డెట్రాయిట్ కు - హైదరాబాద్ నుంచి డల్లాస్ కు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజును కోరామని చెప్పారు. బుధవారం కేంద్ర విమానయాన అధికారులతోను, కేంద్ర మంత్రితో కూడ ఈ విషయంగా మాట్లాడనున్నట్లు రేవంత్ తెలిపారు. దీంతోపాటుగా ఒక లేఖను కూడ కేంద్ర మంత్రికి పంపామన్నారు. ఈ విమాన సర్వీసులు ప్రారంభమయితే డెట్రాయిట్, డల్లాస్ ప్రాంతాలలో నివసిస్తున్న వేలాది తెలుగు కుటుంబాల కష్టాలు తీరుతాయని చెప్పారు. దీనిపై కేంద్ర విమానయానశాఖ అనుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.