Begin typing your search above and press return to search.
కేసీఆర్‌కు రేవంత్ ఘాటు లేఖ.. తక్షణమే స్పందించాలని డిమాండ్
By: Tupaki Desk | 21 Jan 2022 1:36 PM GMTతెలంగాణలో లేఖల పర్వం కొనసాగుతోంది. రాష్ట్రంలోని రైతులను ఆదుకోవాలని కోరుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ పెద్దలకు లేఖలు రాస్తున్నారు. ఇక, రాష్ట్రంలోని ప్రతిపక్షాలు.. రైతులను ఆదుకోవాలని కోరుతూ.. సీఎం కేసీఆర్‌కు లేఖలు సంధిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో లేఖల పరంపర కొనసాగుతోంది. తాజాగా సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి ఘాటు లేఖ సంధించారు. రాష్ట్రంలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మిర్చి రైతులకు ఎకరాకు రూ.50 వేలు, ఇతర పంటలకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10లక్షలు నష్టపరిహారం ఇవ్వాలన్నారు.
రాష్ట్రంలో అకాల, భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మిర్చి రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని.. మిగతా పంటలకు ఎకరాకు రూ. 25 వేలు చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో తామర తెగులు, భారీ వర్షాలతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారని.. మిర్చి పంట మంచిగా పండితే ఎకరాకు 3.50 లక్షల ఆదాయం వస్తోందని ఆశపడి ఎకరాకు లక్షన్నర పెట్టుబడి పెట్టారన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్.. తర్వాత తప్పించుకుని మంత్రులను, అధికారులను పంపించారని విమర్శించారు. రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల్లో ప్రకృతి వైపరీత్యాలతో దాదాపు రూ.8వేల 633కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. కేంద్రం ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిన నిధులను ఏం చేశారని ప్రశ్నించారు. వెంటనే రైతులను ఆదుకోకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతుల కోసం ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు.. బీజేపీ నేతలు కూడా కేసీఆర్కు ఇప్పటికే లేఖలు రాసిన విషయం తెలిసిందే. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్రానికి, ప్రతిపక్షాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నాయి.. ఇది బాగానే ఉ న్నా.. రైతులకు న్యాయం జరిగేదెప్పుడు? అనేది ప్రశ్న. దీనికి మాత్రం ఎవరూ ఆన్సర్ ఇవ్వకపోవడం గమనార్హం.