Begin typing your search above and press return to search.
రేవంత్ ఆ విషయం మాత్రం వదిలిపెట్టట్లేదుగా?
By: Tupaki Desk | 15 Dec 2016 2:45 PM GMTటీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి మరోమారు టీఆర్ ఎస్ సర్కారుపై ఆసక్తికరమైన ఎదురుదాడి చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ ఎస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేసే విషయంగా రాష్ట ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై గడువులోగా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ ను రేవంత్ రెడ్డి కోరారు. ఉన్నత న్యాయస్థానం దీనికోసం ఇచ్చిన మూడు నెలలగడువు ఈనెల 20వ తేదీతో ముగుస్తోందని గుర్తు చేస్తూ..ఈమేరకు ఒక లేఖను స్పీకర్ మధుసూదనాచారికి అందజేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రేవంత్ లేఖ ఆసక్తికరంగా మారింది.
2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికై టీఆర్ ఎస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్రావు - తలసాని శ్రీనివాస్ యాదవ్ - జి. సాయన్న- టి. ప్రకాశ్ గౌడ్ - తీగల కృష్ణారెడ్డి - మంచిరెడ్డి కిషన్ రెడ్డి - మాధవరం కృష్ణారావు - కె.పి.వివేకానంద్ - చల్లా ధర్మారెడ్డి - ఎస్. రాజేందర్ రెడ్డి - మాగంటి గోపీనాథ్ - అరికెపూడి గాంధీ తదితరులు టీఆర్ ఎస్ పార్టీలో చేరిన విషయం అందరికీ తెలిసిందే. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉండగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకముందే తెలుగుదేశం శాసనసభాపక్షాన్ని (టీడీఎల్బీని) టీఆర్ ఎస్ లోకి విలీనం చేస్తున్నట్లు స్పీకర్ ఇచ్చిన ఆదేశాలపై రేవంత్ రెడ్డి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంగానే హైకోర్డు సెప్టెంబర్ 21వ తేదీన తీర్పు ఇస్తూ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు పెండింగ్ లో ఉండగా వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకముందే టీడీఎల్పీని విలీనం చేయడం సమంజసం కాదని చెప్పి ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మూడు నెలలోపుగా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించింది. హైకోర్టు తీర్పు ప్రకారం ఇచ్చిన మూడు నెలల గడువు ఈ నెల 20వ తేదీ నాటికి ముగిసిపోనుంది. ఈ పరిస్థితుల్లోనే హైకోర్డు ఇచ్చిన తీర్పు విషయంగా చర్యలు చేపట్టాలని, అనర్హత పిటిషన్ల విచారణకు సమయాన్ని కేటాయించాలని గతంలోకూడా రేవంత్ స్పీకర్ కు లేఖ అందజేశారు.
అసెంబ్లీ స్పీకర్ హోదాలో రాజ్యాంగం ఆదేశిస్తున్న చట్టాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. హైకోర్టు తీర్పు మేరకు ఇచ్చిన గడువులోగా అనర్హత పిటిషన్లను విచారించి వాటిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. గడువు లోగా నిర్ణయం తీసుకోని పక్షంలో కోర్టు ధిక్కరణపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వస్తుందని కూడా స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో టీడీపీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇప్పటికీ తమ పార్టీలోనే కొనసాగుతున్నట్లుగా గుర్తించాలని రేవంత్ కోరారు. 15 మంది ఎమ్మెల్యేలు - ఏఏ పార్టీకి ఏ విధంగా సీట్లను కేటాయిస్తారో అదే విధంగా అసెంబ్లీలో సీట్లను కేటాయించాలని, ప్రశ్నలను అడగడానికి, చర్చలు చేయడానికి అదే స్థాయిలో సమయాన్ని కూడా కేటాయించాలని స్పీకర్ కు రాసిన లేఖలో కోరారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/