Begin typing your search above and press return to search.
సెల్ టవర్ ఎక్కిన కుర్రాడికి రేవంత్ కి సంబంధమేంటి?
By: Tupaki Desk | 29 July 2018 5:48 AM GMTఏపీ ప్రత్యేక హోదా కోసం అక్కడి ఎంపీలు చేసిందంతా ఒకెత్తయితే రెండు రోజుల కిందట ఓ కుర్రాడు చేసిన పని ఇంకో ఎత్తు. బంధం ఉమేశ్ రెడ్డి అనే యువకుడు దిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో సెల్ టవర్ ఎక్కి ఏపీ ప్రత్యేక హోదా కోసం నినాదాలు చేసి దేశం దృష్టిని ఆకర్షించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే అక్కడి నుంచి దూకేస్తానంటూ బెదిరించిన ఆయన తెలంగాణకు చెందిన కీలక నేతకు వీరాభిమానట.
అవును... ఒకప్పుడు టీడీపీలో ఉండి ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న యంగ్ లీడర్ రేవంత్ రెడ్డి అనుచరుడు. ‘‘రేవంతన్న జనసైన్యం’’ అనే టీంకి వ్యవస్థాపక అధ్యక్షుడు ఈయన. వరంగల్‌కు చెందిన ఉమేష్ గతంలో తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ అఫ్ హైదరాబాద్ లీడర్ గా వ్యవహరించాడు. వైజాగ్ డిఫెన్సె అకాడెమీలో చదువుకున్న ఆయన రేవంత్ రెడ్డికి సంబంధించిన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటాడు.
అయితే.. ఉమేశ్ ఇలా చేయడం వెనుక టీడీపీ - రేవంత్ ఉన్నారా.. లేదంటే వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుని ఉమేశ్ అలా చేశారా అన్నది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. రేవంత్ వెనక తిరుగుతూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా ఇంకా తగిన గుర్తింపు రాలేదన్న ఉద్దేశంతో జాతీయ మీడియాను ఆకర్షించే ఎత్తుగడతో ఉమేశ్ ఈ పనిచేసినట్లు చెబుతున్నారు.