Begin typing your search above and press return to search.
పవన్ కల్యాణ్ మద్దతు కోరనున్న రేవంత్!
By: Tupaki Desk | 24 July 2017 11:45 AM GMTప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తెలంగాణలో టీఆర్ ఎస్ బలం రెట్టింపయింది. గులాబీ పార్టీ ఆకర్ష్ పథకానికి టీడీపీ కి చెందిన చాలామంది ఎమ్మల్యేలు టీఆర్ ఎస్ గూటికి చేరారు. టీఆర్ ఎస్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న తర్వాత తెలంగాణలో టీడీపీ ఉనికే ప్రశ్నార్థకమైంది. 2016లో జరిగిన జీహెచ్ ఎంసీ ఎన్నికల ఫలితాలలో టీడీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీకి పునర్ వైభవం కల్పించేందుకు రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. 2019 ఎన్నికల నాటికి తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారానికి సినీ గ్లామర్ ను వాడుకోవాలని రేవంత్ భావిస్తున్నారు. ఇందుకోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని రేవంత్ యోచిస్తున్నారు.
2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. టీడీపీ అధికారంలోకి రావడానికి పవన్ కల్యాణ్ ప్రచారం దోహదం చేసిందనేది అందరికీ తెలిసిన విషయమే. పవన్ కల్యాణ్ కు ఉన్న చరిష్మాను ఉపయోగించుకొని తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలని రేవంత్ భావిస్తున్నారు. తెలంగాణలో టీడీపీ, జనసేనలు కలిసి పోరాడేందుకు పవన్ కల్యాణ్ సహకారాన్ని కోరనున్నారని
తెలిసింది.
బహిరంగ సభలు, ర్యాలీలలో ప్రజలను ఆకర్షించడానికి పవన్ కల్యాణ్ క్రేజ్ ను ఉపయోగించుకోవాలని రేవంత్ యోచిస్తున్నారు. ఇదే విషయాన్ని తమ అధినేత చంద్రబాబునాయుడుకు కూడా తెలియజేసినట్లు సమాచారం. అయితే, ఈ వ్యవహారం గురించి పవన్ ఇంకా స్పందిచాల్సి ఉంది. ఈ నెల 31న అమరావతిలో చంద్రబాబునాయుడుతో పవన్ కల్యాణ్ భేటీ కానున్న సంగతి తెలిసిందే.