Begin typing your search above and press return to search.

ఢిల్లీ ధర్నాలోనూ రేవంత్ రెడ్డి మార్క్.. బీసీ సంఘాల మనసు దోచేశాడు

By:  Tupaki Desk   |   14 Dec 2021 2:30 AM GMT
ఢిల్లీ ధర్నాలోనూ రేవంత్ రెడ్డి మార్క్.. బీసీ సంఘాల మనసు దోచేశాడు
X
జంతర్ మంతర్ లో తెలుగు రాష్ట్రాల బీసీ సంఘాల ధర్నాకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మద్దతు ప్రకటించారు. తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ నాయకులంతా కలిసి బీసీ జంగ్ సైరస్ ధర్నా ఢిల్లీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెండు రాష్ట్రాలకు చెందిన బీసీ కార్యకర్తలు హాజరయ్యారు.

జనగణనలో బీసీలను కులాల వారీగా లెక్క తేల్చాలని డిమాండ్ చేస్తూ బీసీ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎందుకు బీసీల గురించి పార్లమెంట్ లో మాట్లాడడం లేదని ప్రశ్నించారు.

జంతర్ మంతర్ లో బీసీ సంఘాల నాయకులు ధర్నా చేస్తుంటే వారికి సంఘీభావం తెలుపకుండా 9మంది తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు ఏం ఉండి కూడా ఏం చేస్తున్నారని రేవంత్ రెడ్డి నిలదీశారు.

కేసీఆర్ సీఎం అయ్యింది బీసీల ఓట్ల ద్వారానే అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయని.. బీసీలలో కుల గణాలు లెక్కించడం వల్ల బీసీ విద్యార్థులు ఉద్యోగాలు పొందే హక్కు ఉంటుందని.. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో బీసీల కుల లెక్కలు చేపట్టిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

దేశ ప్రధాన మంత్రి బీసీ అయినప్పటికీ బీసీలకు మాత్రం అన్యాయం జరుగుతోందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల మద్దతు లేకుండా బీజేపీ అధికారంలోకి వచ్చిందా? అని సూటిగా ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. నరేంద్రమోడీ ప్రధాని అయ్యాక బీసీల గురించి పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

బీసీ నేతల ధర్నాకు కనీసం మద్దతు ప్రకటించకుండా టీఆర్ఎస్ ఎంపీలు ఏమయ్యారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీసీల వెంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఉంటుందని రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ స్పష్టం చేశారు.