Begin typing your search above and press return to search.

రేవంత్‌కు షరతులతో కూడిన బెయిల్‌

By:  Tupaki Desk   |   9 Jun 2015 9:27 AM GMT
రేవంత్‌కు షరతులతో కూడిన బెయిల్‌
X
ఓపక్క ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా బుక్‌ అయ్యారన్న అభిప్రాయం.. మరోవైపు ఏసీబీ కస్టడీలో నోరు జారారన్న వార్తలు.. మరోవైపు తమ విచారణ సంతృప్తికరంగా సాగని నేపథ్యంలో మరికొంత కాలం విచారణకు అవకాశం ఇవ్వాలని ఏసీబీ కోర్టును కోరుతుందన్న సంకేతాల క్రమంలో.. రేవంత్‌కు జూన్‌ 11న బెయిల్‌ లభిస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

జూన్‌ 11 నాటికి రేవంత్‌కు బెయిల్‌ లభిస్తుందా? లేదా? అన్న అంశంపై అంత ఆసక్తి వ్యక్తం కావటానికి కారణం..అదే రోజు ఆయన కుమార్తె ఎంగేజ్‌మెంట్‌ కావటమే. ఇంట జరిగే శుభకార్యం నాడు రేవంత్‌ ఇంట ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రేవంత్‌రెడ్డి ఇంట జరిగే నిశ్చితార్థానికి షరుతులతో కూడిన బెయిల్‌ లభించే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే తప్పించి.. రేవంత్‌కు ఆ రోజు వరకు అయినా బెయిల్‌ వచ్చే వీలుందని చెబుతున్నారు.కుమార్తె ఎంగేజ్‌మెంట్‌కు హాజరయ్యే విధంగా రేవంత్‌కు బెయిల్‌ లభించే వీలుందని చెబుతున్నారు. మరి.. ఇదెంత వరకు నిజం అవుతుందో చూడాలి.