Begin typing your search above and press return to search.

లక్షకు ఒక్కరు కూడా తగ్గదన్నారు.. పర్మిషన్ పదివేలమందికేనా?

By:  Tupaki Desk   |   10 Aug 2021 2:44 AM GMT
లక్షకు ఒక్కరు కూడా తగ్గదన్నారు.. పర్మిషన్ పదివేలమందికేనా?
X
అనుకున్నట్లే ఇంద్రవెల్లి సభను భారీగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన సత్తా చాటారు. పెద్ద ఎత్తున ప్రజల్ని తరలించేందుకు జరిగిన ప్రయత్నాలు ఫలించాయి. మండే ఎండతోపాటు.. తీవ్రమైన ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా.. లెక్క చేయకుండా సభకు హాజరయ్యేలా చూసుకోవటం.. లక్షకు ఒక్కరు కూడా తగ్గరు. ఒకవేళ తగ్గితే తల వంచుతానన్న ఆయన మాటలు సంచలనంగా మారటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. సభకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని ఘాటుగా రియాక్టు అయ్యారు. సభా స్థలికి పది కిలోమీటర్లపైనే ఆపేశారని.. సభకు అడ్డురాకుండా నిలిపే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. దీనిపై తాజాగా పోలీసులు రియాక్టు అయ్యారు. ఇంద్రవెల్లిలో నిర్వహించిన సభకు మూడు రోజులుగా అన్ని రకాలుగా బందోబస్తు నిర్వహించామని.. అయినప్పటికి విమర్శలు చేస్తారా? అంటూ పోలీసులు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయటం సరికాదన్న నల్గొండ జిల్లా ఇన్ ఛార్జి ఎస్పీ ఎం.రాజేశ్ చంద్ర మాట్లాడుతూ.. సభకు కేవలం పదివేల మంది మాత్రమే హాజరవుతారని.. అందుకు తగ్గట్లు అనుమతులు పొందారన్నారు. తమకు పర్మిషన్ అడిగిన దానికి మించి తరలింపు జరిగినా.. తాము మాత్రం భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఇకపై ఎవరైనా పోలీసులపై అవాస్తవ ఆరోపణలు చేస్తే కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అయినా.. లక్షకు ఒక్కరు కూడా తగ్గరంటూ మాట్లాడిన రేవంత్.. పోలీసుల పర్మిషన్ ను మాత్రం పది వేల మందికే పరిమితం చేయటం ఎందుకంటారు రేవంత్?