Begin typing your search above and press return to search.

చంద్రబాబును రేవంత్ రెడ్డి కలిశాడా?

By:  Tupaki Desk   |   25 Aug 2020 7:31 AM GMT
చంద్రబాబును రేవంత్ రెడ్డి కలిశాడా?
X
కరోనా టైంలో సోషల్ డిస్టేన్స్ పాటించాలని కేంద్రం సూచిస్తోంది.కానీ అవసరార్థం ఎవరు ఎవరినీ కలుస్తున్నారో తెలియడం లేదు. తెలంగాణ ఫైర్ బ్రాండ్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఈ మద్య దూకుడు ఎక్కువై సొంత ఇమేజ్ పెంచుకునే పనిలో బిజీగా ఉన్నాడట.. అది సీనియర్ కాంగ్రెస్ వాళ్లకు నచ్చడం లేదట.. కానీ ఓవరాల్ గా కేసీఆర్, కేటీఆర్ కు సరితూగే నేతగా తెలంగాణ ప్రజలు నమ్మేలా రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నాడు. తెలంగాణలో కేసీఆర్ ను ఢీకొట్టే నేతగా రేవంత్ రెడ్డి ఇప్పటికే పేరు తెచ్చుకున్నాడు.

అయితే రేవంత్ రెడ్డిని ఇంకా బలోపేతం చేయాలని.. ఎప్పుడైనా మనవాడు (ఇది వరకు టీడీపీలో రేవంత్ పనిచేశాడు) పనికొస్తాడని చంద్రబాబు అనుకుంటున్నాడట.. ఈ మధ్య హైదరాబాద్ సిటీలో రేవంత్ రెడ్డికి క్యాడర్ బాగా పెరిగిందట.. అదంతా చంద్రబాబు చలువే అంటున్నారు. హైదరాబాద్ లోని టీడీపీ కులమైన కమ్మ సామాజికవర్గం మద్దతుతోనే రేవంత్ కు అనూహ్యమైన ఫాలోయింగ్ వచ్చిందని అంటున్నారు.

కరోనా టైంలో హైదరాబాద్ లోనే ఉన్న చంద్రబాబును రేవంత్ రెడ్డి కలిశాడని.. చంద్రబాబు సలహాలు తీసుకున్నాడని.. ఆ తర్వాత రేవంత్ ఇప్పుడు కార్యాచరణ మొదలుపెట్టాడని ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ అనుకూల మీడియా మీద రేవంత్ విరుచుకుపడడానికి చంద్రబాబు వ్యూహమే కారణమంటున్నారు.

ఏది ఏమైతేనేం.. కాంగ్రెస్ లో ఉన్న తనను ఈ స్థాయికి పెంచి పోషించిన చంద్రబాబును రేవంత్ మరిచిపోవడం లేదు. ఆయన డైరెక్షన్ లోనే సాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు ఐడియాలజీ ఫ్లాప్ అయ్యి గత ఎన్నికల్లో చిత్తుగా ఓడాడు. ఆయన ప్లాన్లు రేవంత్ కు పనిచేస్తాయా? లేదా అన్నది వేచిచూడాల్సిందే..