Begin typing your search above and press return to search.
హోదాలు తేలేదాకా నో యాక్టివ్ రోల్!
By: Tupaki Desk | 4 Nov 2017 3:30 PM GMTతన ఎంట్రీ అనేదే గ్రాండ్ గా ఉండాలి.. ఏదో ఓ మూల కూర్చుని పనిచేసుకుంటూ ... ఆ తర్వాత నెమ్మదిగా ఎదిగి పై స్థాయికి వెళ్లేంత ఓపిక సహనం తనకు లేవు అని రేవంత్ రెడ్డి సంకేతాలు ఇస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి నాలుగురోజులు అవుతున్నది గానీ.. ఆయన ఇప్పటిదాకా రాష్ట్ర కాంగ్రెస్ కార్యకలాపాల్లో నేరుగా పాల్గొన్నది లేదు. అలాగే శాసనసభకు హాజరై కాంగ్రెస్ ఎమ్మెల్యేల సరసన కూర్చుని ప్రభుత్వాన్ని నిలదీసి.. కాంగ్రెస్ కు కొత్త బలం చేకూరింది అనే సంకేతం ఇచ్చింది కూడా లేదు. కాంగ్రెసు పార్టీలో తన హోదా, స్థాయి , పదవి ఏమిటో తేలేవరకు ఆయన యాక్టివ్ రోల్ లోకి రాకుండా వ్యూహాత్మకాం వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈనెల 9వ తేదీన రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తున్నారు. రేవంత్ బలనిరూపణ సభగా రాహుల్ సభ జరగబోతోంది. ప్రస్తుతం ఆయన ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లలో ఉన్నారు. రాహుల్ గాంధీ ఆ సభలోనే రేవంత్ కట్టబెట్టే పదవులను కూడా ప్రకటిస్తారని అప్పటినుంచి రేవంత్ హవా కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని పలువురు అంచనా వేస్తున్నారు.
రేవంత్ రెడ్డి కాంగ్రెసులో చేరిన తర్వాత.. తాజాగా శుక్రవారం నాడు కూడా పార్టీ సీనియర్ నాయకుల సమావేశం జరిగింది. సరైన అనుమతులు తీసుకోకుండానే తెలంగాణ సర్కారు ప్రాజెక్టుల విషయంలో ముందుకు వెళ్తుండడం లాంటి అంశాలపై పార్టీ చర్చించింది. ఈ కీలక భేటీకి కూడా రేవంత్ రెడ్డి రాలేదు. 9న రాహుల్ సభ నేపథ్యంలో ఆయన ఏర్పాట్లలో ఉన్నారని అనుకోవచ్చు . కానీ పార్టీలో చేరిన తర్వాత.. పార్టీ పెట్టుకునే కీలక వ్యూహరచనా సమావేశాలకు రాకపోతే ఎలా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రేవంత్ ఒక్కడే కాదు. ఆయనతో పాటు కాంగ్రెస్ లోచేరిన ఏ ఒక్క నాయకుడు కూడా ఇంకా పూర్తిగా కాంగ్రెసుతో మమేకం అయినట్లుగా కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.
అయితే రేవంత్ సన్నిహితులు మాత్రం భిన్నమైన కథనం వినిపిస్తున్నారు. తమ ఎంట్రీ అనేది ఒక బ్యాంగ్ లాగా ఉండాలని, తమ ఎంట్రీ తర్వాత.. పార్టీలో ఎన్ని ముఠాలున్నా తమకు వ్యతిరేకంగా ఎవ్వరూ నోరు విప్పగల సాహసం చేయకుండా ఉండాలని రేవంత్ కోరుకుంటున్నారని, అందుకోసమే రాహుల్ సభ జరిగే దాకా ఆగి, ఆ సభలో పదవులు తేలితే.. పదవుల సహితంగానే.. పార్టీలోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా వారు పేర్కొంటున్నారు. మొత్తానికి రేవంత్ కొత్త పార్టీలో ప్రతి చిన్న పనినీ ఒక స్కెచ్ ప్రకారం చేసుకుంటూ పోతున్నట్లుంది.