Begin typing your search above and press return to search.
రేవంత్ ఇంకో ట్విస్ట్..అటెండర్ తో ఆఫీసు ఓపెనింగ్!
By: Tupaki Desk | 9 Dec 2019 2:26 PM GMTవిలక్షణ రాజకీయాలకు పెట్టింది పేరుగా....తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ పార్టీకి వ్యతిరేకంగా గలం విప్పే ఫైర్ బ్రాండ్ నేతగా పేరొందిన మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మరోమారు అదే రీతిలో వార్తల్లో నిలిచారు. మిగతా రాజకీయ వేత్తలకు - రాజకీయ ఎత్తుగడలకు తాను భిన్నమని చాటుకున్నారు. తనను గెలిపించిన మల్కాజ్ గిరి ప్రజలకు చేరువ అయ్యేందుకు ఎంపీ రేవంత్ రెడ్డి కొత్త కార్యాలయం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా అట్టహాసంగా ఎంపీ రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి పార్లమెంటరీ కార్యాలయం ప్రారంభమైంది. అయితే, రేవంత్ రెడ్డి కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించింది ఎవరో తెలుసా.. గాంధీభవన్ అటెండర్ షబ్బీర్.
షబ్బీర్ 40 ఏళ్ళ నుంచి గాంధీభవన్ అటెండర్ గా పనిచేస్తున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గంలో కొత్త కార్యాలయం ఏర్పాటుచేసిన రేవంత్ షబ్బీర్ తో ప్రారంభించి - వినూత్న సంప్రదాయానికి తెరతీశారు. ఎంతోమంది కాంగ్రెస్ అగ్రనేతలైన పీసీసీ అధ్యక్షులు - ముఖ్యమంత్రులు - ఎంతోమంది మంత్రులు - ఎమ్మెల్యేలకు అంకిత భావంతో సేవలందించిన తనకు రేవంత్ రెడ్డి కార్యాలయం ప్రారంభించే అవకాశం రావటం అదృష్టమని అటెండర్ షబ్బీర్ మురిసిపోయాడు. సామాన్యుడైన షబ్బీర్ సేవలను గౌరవించిన MP రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు ప్రశంసించారు.
కాగా, తన కార్యాలయానికి వస్తే నమ్మకం దొరుకుతుందనే భరోసా ప్రజల్లో కలిగించేలా పనిచేస్తా అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ ప్రజలకి ప్రతి శనివారం గ్రీవెన్స్ డే అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రతి శనివారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు కేవలం మల్కాజ్ గిరి ప్రజల కోసమే సమయం కేటాయిస్తానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.