Begin typing your search above and press return to search.
చంద్రుళ్లు జంటగా.. రేవంత్ ఒంటరిగా..
By: Tupaki Desk | 27 Dec 2015 8:55 AM GMT టీడీపీ - టీఆరెస్ అధినేతల రాజకీయం ఇప్పుడు టీటీడీపీ నేత రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పడేసింది. రేవంత్ రెడ్డి ఒక్కరినే కాకుండా మొత్తం టీటీడీపీనే ఇది ఇబ్బంది పెడుతున్నా రేవంత్ రెడ్డికి మరింత ఇబ్బందికరంగా మారిందంటున్నారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ - శాసనసభ పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు బాబు నిర్ణయాన్ని కాదనలేక సర్దుకుపోతున్నా రేవంత్ కు మాత్రం ఇది మింగుడుపడడం లేదు. చంద్రబాబు కేసీఆర్ తో సయోధ్యను వీడి తనకు ఫ్రీడమ్ ఇస్తే కేసీఆర్ ను ఢీకొడతానని అంటున్నారు. అంతేకాదు... కేసీఆర్ - చంద్రబాబుల దోస్తానా కారణంగా రేవంత్ నోరు కట్టుకోవాల్సి వస్తోంది. కేసీఆర్ ను ఇంతకు ముందులా ఫామ్ హౌజ్ సీఎం అనో, ఇంకోటనే తిట్టలేని పరిస్థితి. పైగా కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడడానికి ప్రెస్ మీట్ పెడితే మిగతా టీడీపీ నేతలెవరూ అక్కడు రావడం లేదు. రేవంత్ ఒక్కరే ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సి వస్తోంది.
మరోవైపు కేసీఆర్ ఆయుత చండీయాగంపై కాంగ్రెస్ విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలు ఏమీ అనలేకపోతున్నారు. చంద్రబాబు ఆ కార్యక్రమానికి ప్రత్యేకంగా వస్తుండడంతో టీటీడీపీ నేతలు దాని జోలికి వెళ్లడం లేదు. ఇతరత్రా విమర్శలు కూడా వదిలేసి ఎవరి పనులు వారు చేసుకుంటూ పోతున్నారు. దీంతో రేవంత్ సొంత పార్టీలోనే ఒంటరి పోరు చేస్తున్నారు. తాను స్పీడు పెంచి తప్పు చేశానా అనుకుంటున్నారట. ఓటుకు నోటు కేసు రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు తెచ్చినా పాపులారిటీ మాత్రం పెంచింది. ఆ పాపులారిటీతో రేవంత్ స్పీడు పెంచినప్పటికీ కొద్దిరోజుల్లోనే చంద్రబాబు, కేసీఆర్ ల దోస్తానా మొదలవడంతో రేవంత్ కు కాళ్లు చేతులు కట్టేసినట్లవుతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన వెంటే మిగతా నేతలు ఉండడంతో రేవంత్ ఒంటరిగా మారారు.