Begin typing your search above and press return to search.
రేవంత్ అల్లుడు ఆంధ్రావాలా!
By: Tupaki Desk | 11 Jun 2015 9:06 AM GMTవీర తెలంగాణ వాదం నినిపించి ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి.. ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టిన కేసీఆర్.. నిజానికి ఓ ఆంధ్రా ప్రాంత వ్యక్తి అనే ఆరోపణ ఉంది. ఆయన పూర్వీకులది విజయనగరం జిల్లా అని అంటారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ చదివింది కూడా ఆంధ్రా ప్రాంతంలో. ఆయన ఆంధ్రా వ్యక్తులతో కలిసి వ్యాపారాలు చేస్తారని కూడా ప్రత్యర్థులు ఆరోపిస్తారు. ఇక ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పది రోజులుగా వార్తల్లో వ్యక్తిగా ఉంటున్న రేవంత్ రెడ్డి వ్యవహారమే చూస్తే.. ఆయన కూడా వీర తెలంగాణ వాదిగానే ముద్ర వేసుకున్నారు.
ఐతే రేవంత్‌కు ఆంధ్రా నాయకులతో, ప్రజలతో మంచి సంబంధాలే ఉన్నాయి. రేవంత్ ఇప్పుడు అల్లుణ్ని తెచ్చుకుంది కూడా ఆంధ్రా ప్రాంతం నుంచే కావడం విశేషం. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన సత్యనారాయణ రెడ్డిని రేవంత్ అల్లుడుగా చేసుకున్నారు. గురువారం రేవంత్ కూతురి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. బయట ఏసీబీ పోలీసులు పహరా కాసి ఉండగా.. లోపల భారీగా హాజరైన అతిథుల మధ్య ఆడంబరంగా నిశ్చితార్థ కార్యక్రమాన్ని జరిపించారు రేవంత్. ఓటుకు నోటు కేసు వెంటాడుతున్నప్పటికీ రేవంత్‌లో ఏమాత్రం ఆత్మవిశ్వాసం తగ్గలేదు. చాలా ఉత్సాహంగా కనిపించారాయన. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా ఈ వేడుకకు హాజరయ్యారు. రెండు రాష్ట్రాలకు చెందిన తెలుగు దేశం నాయకులతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేశారు.