Begin typing your search above and press return to search.
ఎంగిలి మెతుకుల కోసమే.. : కోమటిరెడ్డిపై నిప్పులు చెరిగిన రేవంత్
By: Tupaki Desk | 2 Aug 2022 5:13 PM GMTకాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఎపిసోడ్ తర్వాత మీడియా ముందుకు వచ్చిన రేవంత్ రెడ్డి.. బీజేపీ విసిరిన ఎంగిలి మెతుకులు కోసమే పార్టీ మారారని రాజగోపాల్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
‘కాంట్రాక్టుల కోసం, ఆర్థిక అవసరాల కోసమే పార్టీ మార్పు. ఏనుగులు తినే వాడు పోయి, పీనిగులు తినే వాడు వచ్చాడు. ఇతర పార్టీల నుంచి వ్యక్తులను తీసుకుంటున్నారు.
నరేంద్ర మోడీని తెలంగాణ సమాజం బహిష్కరించాలి. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ. ఏపీలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుందని తెలిసిన కూడా... సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఈడీ ద్వారా కేసులు పేట్టి వేదింపులు చేస్తున్నారు. సోనియా మీద గౌరవం ఉందని తియ్యని మాటలు మాట్లాడారు. సోనియాను ఈడి ప్రశ్నిస్తే , రాజగోపాల్ మాత్రం అమిత్ షా విసిరే కుక్క బిస్కెట్లు కోసం వెళ్లారు’ అని రేవంత్ విమర్శించారు.
తల్లిని వేధిస్తున్న వారిపై పోరాడాల్సింది పోయి వారితోనే జత కడుతున్నారని నిప్పులు చెరిగారు. కొందరు కన్నతల్లి వంటి కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘తెలంగాణను అవమానించిన వారిని ఎవరైనా పొగుడుతారా? ఇలాంటి వారిని తెలంగాణ జాతి క్షమించదు. సోనియాగాంధీని ఈడీ విచారణ చేస్తుంటే.. రాజగోపాల్‌రెడ్డి కాంట్రాక్టులు కుదుర్చుకున్నారు’’ అని రేవంత్ విమర్శించారు.
‘‘తెలంగాణ ప్రజలకు బీజేపీ అసలు స్వరూపాన్ని చూపిస్తోంది. లోక్‌సభ సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోడీ అవహేళన చేశారు. ఈడీ బీజేపీకి ఎలక్షన్ డిపార్ట్‌మెంట్‌గా మారింది. ఈడీ ద్వారా అక్రమ కేసులు పెట్టి కాంగ్రెస్‌ను వేధిస్తున్నారు.
సోనియా కోసం పోరాడాల్సిన సమయంలో.. ఇలా చేస్తారా?`` అని నిలదీశారు. ఈ నెల 5న మునుగోడులో కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం నిర్వహించనున్నట్టు రేవంత్ చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌కు అండగా ఉంటారని అన్నారు. ఉప ఎన్నిక వస్తే.. అది కాంగ్రెస్-టీఆర్ ఎస్‌కు మధ్య మాత్రమే పోటీ అని వ్యాఖ్యానించారు.