Begin typing your search above and press return to search.
కవితపై రేవంత్ ఫ్యామిలీ ప్యాక్ కామెంట్ !
By: Tupaki Desk | 14 Jan 2016 3:58 AM GMTతెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తన దూకుడు మాటలతో నిరంతరం వార్తల్లో నిలుస్తుంటారు. సందర్భం ఏదైనా తనదైన శైలిలో సెటైర్లు విసిరే రేవంత్‌కు అధికార టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై విమర్శలు చేయడంలో అయినా ముందుంటారు. కొద్దికాలం కేసీఆర్‌పై విమర్శలు చేసిన రేవంత్ ఆ తర్వాత తన రూటును హరీశ్‌రావుపైకి మార్చారు. దానికి హరీశ్ ధీటుగా స్పందించడంతో కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌పై విమర్శలు చేశారు.
ఇపుడు తనదైన శైలిలో సీఎం కేసీఆర్ కూతురు, ఎంపీ కవితపై రేవంత్‌రెడ్డి విమర్శలు చేశారు. అయితే ఈ దఫా కవిత ఒక్కరినే టార్గెట్ చేయకుండా మొత్తం కేసీఆర్ కుటుంబాన్ని ఫ్యామిలీ ప్యాక్ కింద పరిగణించి విమర్శలు చేశారు. ఇటీవల పలు సందర్భాల్లో కవిత తన తండ్రి కేసీఆర్ భోళా శంకరుడని, తెలంగాణ కోసం ఏమైనా చేస్తారని అన్నారు. దీనిపై రేవంత్ పంచ్‌లు వేశారు. కేసీఆర్ భోళా శంకరుడని తాను అంగీకరిస్తున్నానని అయితే పరిమితమైన వారికే ఆయన భోళా శంకరుడని ఎద్దేవా చేశారు. ఆ పరిమితమైన వ్యక్తులు కూడా కేసీఆర్ కుటుంబ సభ్యులేనని అన్నారు. కవిత మేనబావ, మంత్రి హరీష్ రావుకు మిషన్ కాకతీయ కింద కేసీఆర్ చెరువులు ఇవ్వడం, కమీషన్ల కోసం కొడుకు కేసీఆర్‌కు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును సృష్టించడం, బతుకమ్మ ఆడుకునేందుకు ఇంటి బిడ్డగా అడిగినందుకు కోట్లాది రూపాయలు కవితకు ఇవ్వడం ద్వారా కేసీఆర్ భోళా శంకరుడని నిరూపించుకున్నాడని రేవంత్ నిప్పులు చెరిగారు.
గతంలో కూడా సమగ్ర సర్వే సందర్భంగా కవిత రెండు చోట్లా సర్వేలో పాల్గొన్నారని విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి ఇపుడు ఏకంగా కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ ఆయన కుటుంబం మొత్తంపై విమర్శలు చేశారు. సహజంగా రేవంత్ అంటే మండిపడే టీఆర్ఎస్ వర్గాలు ఈ పరిణామంపై నిప్పులు చెరుగుతాయా? లేదా రేవంత్ కామెంట్లకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఉంటాయా? వేచి చూడాల్సిందే.