Begin typing your search above and press return to search.

నాయిని అల్లుడి బాధ‌కు రేవంత్ యాడ్ అయ్యాడే!

By:  Tupaki Desk   |   13 Oct 2018 11:57 AM GMT
నాయిని అల్లుడి బాధ‌కు రేవంత్ యాడ్ అయ్యాడే!
X
ఇప్పుడు న‌డుస్తున్న‌దంతా డిజిట‌ల్ యుగం. ప్ర‌తి క్ష‌ణాన్ని ఎవ‌రికి వారు వీలైనంత వ‌ర‌కూ వీడియో రూపంలోనో.. ఫోటోల రూపంలోనో బంధిస్తూనే ఉంటారు. ఇక‌.. రాజ‌కీయ నేత‌లు.. అందునా తాజా మాజీ మంత్రిగా.. తెలంగాణ రాష్ట్ర తొలి హోం మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన నాయిని లాంటోళ్లు ఎంత జాగ్ర‌త్త‌గా మాట్లాడాలి. కానీ.. అలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోని నాయిని తాజాగా నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో బ‌రస్ట్ అయ్యారు.

అస‌లే అల్లుడికి కోరుకున్న సీటు టికెట్ తెప్పించుకోలేక‌పోవ‌టం ఒక బాధ అయితే.. త‌న‌కు జాన్ జిగిరి అయిన పార్టీ అధినేత కేసీఆర్ క‌నీసం త‌న‌కు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ‌ని వేళ‌.. ఫ‌స్ట్రేష‌న్ లో ఉన్న ఆయ‌న మీడియాతో మాట్లాడారు. బాధ‌లో ఉన్న ఆయ‌న మీడియాతో మాట్లాడే సంద‌ర్భంలో అడ్డంగా బుక్ అయ్యే వ్యాఖ్య‌లు చేశారు.

2014 ఎన్నిక‌ల్లో త‌న‌ను పోటీకి నిల‌బ‌డొద్ద‌ని.. అవ‌స‌ర‌మైతే ఎన్నిక‌ల్లో పోటీకి రూ.10 కోట్లు ఇస్తామ‌న్న మాట కేసీఆర్ చెప్పిన వైనాన్ని గుర్తు చేశారు.

నాయిని నోటి నుంచి ఆ మాట వ‌చ్చిందే త‌డువు మీడియాలో వ‌చ్చేసింది. ఒక ఎమ్మెల్యే పోటీకి రూల్స్ ప్ర‌కారం చూస్తే చాలా త‌క్కువ ఖ‌ర్చు చేయాలి. అలాంటి ఒక పార్టీ అధినేత.. త‌న పార్టీ నేత‌కు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీకి అవ‌స‌ర‌మైన ఖ‌ర్చు (10 కోట్లు) ఇస్తాన‌ని చెప్ప‌టం పై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రియాక్ట్ అయ్యారు. నాయిని మాట‌ల్ని సుమోటాగా తీసుకుంటూ ఆయ‌నపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

ఏదో ఆవేద‌న‌లో ఉన్న త‌న మాట‌ల్ని ప‌ట్టుకొని.. చ‌ర్య‌ల కోసం డిమాండ్ చేయాలంటూ రేవంత్ వ్యాఖ్య‌లు నాయినికి మంట పుట్టేలా చేశాయి. అంతే ఆయ‌న తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. రేవంత్ చిల్ల‌ర‌గాడ‌ని.. ఈసారి కొడంగ‌ల్ లో కూడా ఓడిపోవ‌టం ఖాయ‌మ‌న్నారు. తాను ముషీరాబాద్ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాట‌ల‌పై రేవంత్ రాద్దాంతం చేస్తున్నార‌ని ఫైర్ అయ్యారు నాయిని.

తాను పొర‌పాటున కేసీఆర్ ఇస్తాన‌న్న రూ.5.. రూ.10 ల‌క్ష‌లకు బ‌దులుగా రూ.10 కోట్లు ఇస్తాన‌న్న మాట‌ను అన్నాన‌ని.. దానికే ఇంత రాద్దాంతం చేయాలా? అని ప్ర‌శ్నించారు. నాయిని మాట‌ల్లోని పాయింట్ తీసిన రేవంత్ చిల్ల‌రోడిగా అభివ‌ర్ణించిన నాయిని.. అదే స‌మ‌యంలో త‌న తప్పును నాయిని క‌రెక్ట్‌ చేసుకునే ప్ర‌య‌త్నంలో అస‌లు విష‌యం అర్థం కావాల్సిన వారంద‌రికి అర్థ‌మైంద‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.