Begin typing your search above and press return to search.
ఫైర్ బ్రాండ్ కాస్తా ఏక్ నిరంజన్ అయ్యాడు
By: Tupaki Desk | 20 March 2016 4:18 AM GMTతెలంగాణ తెలుగుదేశం పార్టీని అభిమానించి.. ఆరాధించే వారంతా.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలకు తీవ్ర వేదనకు గురి అవుతున్నారు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వెలిగిపోయిన టీడీపీ.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో బిత్తరపోతున్న పరిస్థితి. ఆపరేషన్ ఆకర్ష్ తో ముగ్గురు మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా జంప్ కావటంతో తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. నిన్నమొన్నటివరకూ పార్టీకి అండగా నిలిచి.. అధికారపక్షాన్ని దునుమాడిన నేతలంతా ఇప్పుడు గులాబీ కండువాలు వేసుకొని.. కేసీఆర్ జిందాబాద్ అంటున్న పరిస్థితి.
మిగిలిన తమ్ముళ్ల విషయాన్ని కాస్త పక్కన పెడితే.. టీటీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి పరిస్థితి మరింత దిగజారింది. ఒకప్పుడు చుట్టూ తన పార్టీ ఎమ్మెల్యేలు అన్న వారు ఉండి కళకళలాడితే.. తాజాగా ఆయనకు మరో ఎమ్మెల్యే (సండ్ర) తప్పించి వెంట ఎవరూ లేరు. దీంతో.. మంది బలంగా చెలరేగిపోయిన రేవంత్ ఇప్పుడు అందుకు భిన్నంగా ఉండిపోతున్నారు. అసెంబ్లీలో మైకు కోసం కోట్లాడిన రేవంత్.. ఇప్పుడు నోరు విప్పేందుకు వీల్లేని పరిస్థితుల్ని జీర్ణం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఫైర్ బ్రాండ్ బిరుదుతో ప్రతి చిన్న అవకాశానికి చెలరేగి పోయిన రేవంత్ కు.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఒకప్పుడు ఏ పార్టీ అధినేత అంతు చూస్తానని ఓపెన్ చాలెంజ్ చేసి.. తొడ కొట్టిన రేవంత్ ఇప్పుడందుకు భిన్నంగా కనీసం నోరు విప్పి అధికారపక్షాన్ని ఎండగట్టలేక పోతున్నారు. అసెంబ్లీకి వచ్చామా? వెళ్లామా అన్నట్లుగా రేవంత్ పరిస్థితి మారిపోయింది. ఒకప్పుడు రేవంత్ వస్తున్నాడంటే..కెమేరాలన్నీ సిద్ధమైపోయేవి. ఇప్పుడు గతంలో మాదిరి లేని పరిస్థితి. వెంట ఉన్న సండ్ర ఒక్కరు తప్ప మరే బలం లేని రేవంత్ ఇప్పుడు బలహీనంగా మారిపోయారు. ఏక్ నిరంజన్ హోదా రేవంత్ లాంటి నేతకు అస్సలు నప్పటం లేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. మరి.. దీనిపై రేవంత్ ఎలా రియాక్ట్ అవుతారో..?