Begin typing your search above and press return to search.
బాబును ఇరకాటంలో పెట్టిన రేవంత్ రెడ్డి
By: Tupaki Desk | 5 Dec 2015 12:37 PM GMTవరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక ముగిసిన కొద్దిరోజులకే వచ్చిపడిన స్థానిక సంస్థల మండలి ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలను వేడేక్కిస్తున్నాయి. మొత్తం 12 స్థానాలకుగాను ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఒంటరిగానే పోటీచేస్తానని ప్రకటించిన నేపథ్యంలో టీటీడీపీ - కాంగ్రెస్ - బీజేపీల మధ్య పొత్తు కోసం చర్చలు సాగుతున్నాయి. మహబూబ్ నగర్ - రంగారెడ్డి జిల్లాల్లో రెండు స్థానాలు ఉన్న కారణంగా ఆ రెండు చోట్లా ఒక్కో సీటును పంచుకునే దిశగా టీటీడీపీ - కాంగ్రెస్ సమాలోచనలు చేస్తున్నాయి. నల్గొండ జిల్లాను కాంగ్రెస్ కు వదిలేయాలని, ఖమ్మంలో పోటీ చేయాలని టీటీడీపీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. ఖమ్మంలో తమకు మద్ధతు ఇవ్వాలని సీపీఐ కోరినప్పటికీ ఆ పార్టీయే సొంతంగా అభ్యర్థిని ఖరారుచేసింది.
మిగతా స్థానాల్లో బలమున్న చోట పోటీచేసి, కొన్నిచోట్ల కాంగ్రెస్ కు మద్ధతు ఇవ్వాలనే భావనలో టీటీడీపీ నాయకులు ఉన్నారు. ఈ ప్రతిపాదనను పార్టీ అధినేత చంద్రబాబుకు టీటీడీపీ నేతలు చెప్పనప్పటికీ...అంతర్గతంగా అవగాహనకు వచ్చినట్లు సమాచారం. మెదక్ - నిజామాబాద్ - కరీంనగర్ - వరంగల్ - ఆదిలాబాద్ జిల్లాల్లో పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు. ఒకటిరెండు రోజుల్లో పొత్తులకు సంబంధించి పూర్తిస్థాయి స్వరూపం రావచ్చని సమాచారం. బీజేపీ సైతం ఒకటి రెండు సీట్లు ఆశిస్తున్నప్పటికీ, అవకాశాలు తక్కువేనని టీటీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి విషయలో పేచి నడుస్తోందని సమాచారం. ఈ జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్టు ఆ పార్టీలో కొందరు నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే అక్కడ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి కూడా టికెట్ కోసం పోటీపడుతున్నారు.
పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి కుమారుడి వివాహానికి హైదరాబాద్ కు వచ్చిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుతో టీటీడీపీ నేతలు భేటీ అయినపుడు ఈ విషయం చర్చకు వచ్చింది. కొత్తకోట దయాకర్ రెడ్డి అభ్యర్థిత్వం విషయంలో ఎలాంటి చర్చకు తావివ్వకుండానే 'మీరు సొంత నిర్ణయాలు తీసుకోండి..పరిస్థితులను అంచనా వేస్తూ ముందుకు పోండి..గెలిచే అవకాశాలను నిశితంగా పరిశీలించిన తరువాతే పోటీకి దిగాలి అని చంద్రబాబు సూచించినట్టు సమాచారం.
మొత్తంగా రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు నో చెప్పలేక అవును అని సమాధానం ఇవ్వలేక చంద్రబాబు ఉండిపోయారు. అయితే నామినేషన్ల గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక విషయంలోనే తేల్చుకోలేని పరిస్థితి ప్రధాన పార్టీగా ఉన్న టీడీపీకి ఇబ్బందికరమేనని వ్యాఖ్యానిస్తున్నారు.