Begin typing your search above and press return to search.
రేవంత్ రెడ్డి పేపర్ లెస్ ప్రమాణ స్వీకారం
By: Tupaki Desk | 18 Jun 2019 12:30 PM GMTటీడీపీ నుంచి బయటకొచ్చి చాలాకాలమే అయినా రేవంత్ రెడ్డికి ఇంకా చంద్రబాబు రాజకీయ వాసనలు పోనట్లున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు హైటెక్ పద్ధతులను రేవంత్ కూడా అందిపుచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. అందిపుచ్చుకోవడమే కాదు.. పార్లమెంటు సాక్షిగా రేవంత్ వాటిని చాటుకున్నారు కూడా. ఆ క్రమంలోనే రేవంత్ మంగళవారం పార్లమెంటులో లోక్ సభ సభ్యుడిగా పేపర్ లెస్ ప్రమాణ స్వీకారం చేశారు. మొబైల్ ప్రమాణ పత్రం చూస్తూ ప్రమాణ స్వీకారం చేశారు.
లోక్ సభ సమావేశాల సందర్భంగా రెండో రోజు కూడా సభ్యుల ప్రమాణస్వీకారం కొనసాగుతోంది. నిన్న వైసీపీ, టీడీపీ ఎంపీలు ప్రమాణస్వీకారం చేయగా... ఈరోజు తెలంగాణకు చెందిన టీఆర్ ఎస్- కాంగ్రెస్- బీజేపీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. దేశంలోనే అతి పెద్దదైన మల్కాజ్ గిరి స్థానం నుంచి గెలుపొందిన కాంగ్రెస్ సభ్యుడు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారంలో వైవిధ్యాన్ని చూపించారు. మిగిలిన సభ్యుల మాదిరి పేపర్ పై రాసిన ప్రతిజ్ఞను చదవకుండా... మొబైల్ ఫోన్ లో చూసి తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు.
మరోవైపు, రేవంత్ ప్రమాణస్వీకారం కోసం తన సీటు నుంచి లేచి వస్తున్న సమయంలో... ఇతర రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుస్తూ, రేవంత్ ను ఆహ్వానించారు. కాగా... కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా నిన్న తెలుగులోనే ప్రమాణం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై దక్షిణాదిలో హిందీ రుద్దుడుపై వ్యతిరేకత వస్తున్న సమయంలో ఈ ఎంపీలు తెలుగులో ప్రమాణం చేయడం ఆసక్తికరమే.