Begin typing your search above and press return to search.
టీఆర్ఎస్, బీజేపీలను షేక్ చేసేలా రేవంత్ రెడ్డి ప్లాన్.?
By: Tupaki Desk | 15 July 2022 2:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్ లో ప్రతిరోజు ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉండాలి. వివాదాలతోనే పార్టీ పరిస్థితి తీసికట్టుగా మారింది. వివాదాలు లేకపోతే పార్టీకి పూట గడిచేలా లేదు. అయితే రేవంత్ రెడ్డి వచ్చాక టీ కాంగ్రెస్ పరిస్థితి మారింది. అసమ్మతిని చల్లార్చి.. సీనియర్లను బుజ్జగించి రేవంత్ ట్రాక్ లోకి తీసుకొస్తున్నారు. ఈక్రమంలోనే కాంగ్రెస్ ను తరలిపోయిన నేతలను మళ్లీ రప్పిస్తున్నారు. చేర్చుకుంటున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో కీలకంగా ఉండి టీఆర్ఎస్, బీజేపీలో అసంతృప్తిగా ఉన్న నేతలను కాంగ్రెస్ లోకి లాగుతున్నారు రేవంత్ రెడ్డి.ఇటీవల దివంగత ఎమ్మెల్యే పీజేఆర్ కూతురు.. ఖైరతాబాద్ టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి ఈ మధ్యనే కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక పార్టీలో ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు సీనియర్లను కలుస్తూ వస్తున్నారు. డీఎస్ తోనూ రేవంత్ రెడ్డి సంప్రదింపులు జరిపారు. ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.
టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీనే అని అనుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిగా వచ్చిన తరువాత రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయింది. దీంతో సొంత పార్టీ నాయకులే కార్యవర్గంపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో మళ్లీ కాంగ్రెస్ పాతరోజులకు వెళ్లిపోయిందని భావించారు. కానీ చేరికలను ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ బలోపేతం లక్ష్యంగా రేవంత్ ముందుకెళుతున్నారు.
ఇప్పటికే రాహుల్ ను రప్పించి సభలు పెట్టించి జోష్ నింపిన రేవంత్ రెడ్డి వలసలను ప్రోత్సహిస్తున్నారు. టీఆర్ఎస్ లో కీలక ఎమ్మెల్యేగా చేసి ప్రస్తుతం ప్రాధాన్యత కోల్పోయిన నల్లాల ఓదేలును కాంగ్రెస్ లో చేర్పించారు రేవంత్ . ఈయనే కాదు.. రావి శ్రీనివాస్, బోడ జనార్ధన్, తాటి వెంకటేశ్వర్లు, ఎర్ర శేఖర్, బాలు నాయక్, విజయారెడ్డి, ఒక మేయర్ ను .. ఆయా పార్టీల నుంచి పలువురు కీలక నేతలను కాంగ్రెస్ లో చేర్పించారు. ఇందులో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉండడం గమనార్హం.
ఈ క్రమంలోనే ఈ ఊపును మరింతగా కంటిన్యూ చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. పార్టీ అధికారంలోకి రావాలంటే మరింత మంది రావాలని.. తాజాగా టీఆర్ఎస్, బీజేపీలోని కీలక 20 మంది నేతలకు రేవంత్ గాలం వేసినట్లు సమాచారం. టీఆర్ఎస్ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి, తుమ్మల, కడియం శ్రీహరి, వేముల వీరేశం, పిడమర్తి రవిలను టీఆర్ఎస్ నుంచి లాగాలని రేవంత్ స్కెచ్ గీశాడు.
ఇక బీజేపీలో ఉన్న కొండేటి శ్రీధర్, జితేందర్ రెడ్డి, వివేక్, కూన శ్రీశైలం గౌడ్ ఇంకా కొందరు ముఖ్య నేతలను రేవంత్ సంప్రదించినట్టు తెలుస్తోంది. ఆగస్టు 2న సిరిసిల్లలో నిర్వహించే రాహుల్ గాంధీ సభలో ఈ చేరికలను ప్లాన్ చేసినట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.