Begin typing your search above and press return to search.
అంతేలే..బాబును పొగడ్డం తప్ప మరేం చేయగలడు!
By: Tupaki Desk | 26 Feb 2018 5:09 AM GMTతెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో కీలక నాయకుడు - నేడో రేపో తనకు రాష్ట్ర స్థాయి పదవి ఏదైనా కట్టబెట్టేస్తారని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గనుక.. అనూహ్యంగా ఏదైనా గ్రహాలు అనుకూలించి సుడితిరిగిందంటే.. తానే ముఖ్యమంత్రి అయిపోవచ్చునని కలలు కంటూ ఉండే.. రేవంత్ రెడ్డి.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఎడా పెడా కీర్తించేస్తున్నారు. ఎందుకు కీర్తిస్తున్నారనగా.. 27వ తేదీనాటికి ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు రాజకీయాల్లోకి ప్రవేశించి... 40 ఏళ్లు నిండుతాయిట. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అన్నమాట. అందుకని తెగ పొగిడేస్తున్నారు.
‘నిత్యశ్రామికుడు - నలభయ్యేళ్ల ప్రజాసేవకుడు’... ఇలా చంద్రబాబు ను భజన చేయడానికి రేవంత్ రెడ్డి దగ్గర చాలా చాలా మాటలే ఉన్నట్టున్నాయి. కాకపోతే.. ఎటూ యాక్టివ్ రాజకీయాల్లో చురుగ్గా కనిపించడం లేదు గనుక.. తాను కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి రేవంత్ మరచిపోయి ఈ ట్వీట్లు పెట్టారేమో అని రాజకీయ వర్గాల్లో సెటైర్లు వేసుకుంటున్నారు.
రేవంత్ రెడ్డికి చంద్రబాబు అంటే అపరిమితమైన భక్తి ప్రపత్తులు ఉన్నాయనే సంగతి అందరికీ తెలుసు. పార్టీకి రాజీనామా చేస్తున్న సందర్భంలోనే ఆయన చంద్రబాబుకు రాసిన లేఖలో ఏ రేంజిలో పొగడ్తలు గుప్పించారంటే.. పార్టీకి రిజైన్ చేస్తున్న వ్యక్తి పార్టీ అధ్యక్షుడిని ఆ స్థాయిలో భజన చేసి బయటకు వెళ్లడం అనేది దేశ చరిత్రలోనే ఉండకపోవచ్చునని అంతా అనుకున్నారు. మరి ఇన్నాళ్లుగా కాంగ్రెస్ నీళ్లు వంటపట్టినా కూడా ఇంకా ఎందుకు చంద్రబాబును పొగుడుతున్నట్టు?
‘పొగడక ఇంకేం చేస్తాళ్లే.. ఆయన చేసిన రాజీనామా చంద్రబాబు వద్దనే ఉంది కద!’ అని కొందరు ఎద్దేవా చేస్తున్నారు. చంద్రబాబును తిడితే.. చంద్రబాబు తన వద్ద ఉన్న రేవంత్ రాజీనామాను స్పీకరుకు పంపితే చాలు.. మరు క్షణంలో ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోతుందని అంతా అనుకుంటున్నారు.
ఈ విషయం ఎలా ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ లో రేవంత్ ప్రత్యర్థులకు కొదువలేదు. వారంతా కలిసి... చంద్రబాబును పొగుడుతునన ట్వీట్లను కారణంగా చూపించి - రేవంత్ తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి వారు సిద్ధమవుతున్నారుట. మరి రేవంత్ పట్ల కాస్త సానుకూలంగానే ఉన్న అధిష్టానం ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి.