Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఓటమిపై రేవంత్ చెప్పిన కొత్త లెక్క!
By: Tupaki Desk | 2 July 2018 2:30 PM GMTమాటల మాంత్రికుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను తెగ పొగిడేస్తుంటారు. నిజానికి ఆయన తన మాటలతో అందరిని మంత్రముగ్దుల్ని చేస్తారనాలి. తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్ కు కలిసి వచ్చింది ఆయన పట్టుదల.. మరింకేదో కాదు.. ఆయన మాటలే. తనను తీవ్రంగా వ్యతిరేకించే వారినైనా సరే.. తనతో అరగంట పాటు కూర్చోబెడితే కన్వీన్స్ చేసే తత్త్వం కేసీఆర్ లో చాలా ఎక్కువ.
మరి.. కేసీఆర్ లాంటి మాటల మాంత్రికుడి మాటలకు అదిరిపోయే పంచ్ లు వేయటమే కాదు.. తాను సంధించే ప్రశ్నాస్త్రాలతో ఉక్కిరిబిక్కిరి చేసే తీరు తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆయన నోరు విప్పితే చాలు.. ఛానల్ మార్చాలనుకున్న వారు సైతం కొద్దిసేపు ఆయన మాటల్ని వింటూ ఉండిపోయేలా చేస్తారు. తన మాటలతో కేసీఆర్ అండ్ కోను ఉతికి ఆరేసే రేవంత్ తాజాగా ఆసక్తికర వాదనను వినిపించారు.
ఒక ప్రముఖ మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడిన రేవంత్ 1989లో ఎన్టీఆర్.. 2004లో చంద్రబాబు ఏ విధంగా అయితే ఓటమిపాలయ్యారో 2019 ఎన్నికల్లో కేసీఆర్ కూడా అదే రీతిలో ఓడిపోతారన్నారు.
సుదీర్ఘకాలం పాటు టీడీపీలో ఉన్న రేవంత్.. కేసీఆర్ ఓటమిని.. ఎన్టీఆర్.. బాబులతో పోలిక పెట్టి చెప్పటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్ని చేపట్టిన ఎన్టీఆర్ లాంటి మహానేత సైతం 1989లో ఓడిపోక తప్పలేదన్నారు. దీనికి కారణం ఆయన తన మంత్రివర్గంలోని మంత్రుల మాటలు వినే వారు కాదని.. అదే ఆయన్ను ఓడిపోయేలా చేసిందన్నారు.
2004లోనూ చంద్రబాబు ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారన్నారు. తన మీద తనకున్న నమ్మకంతో పాటు.. పలువురి మాటల్ని విశ్వసించని నేపథ్యంలో ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే బాబు ఓటమి పాలయ్యారని చెప్పారు. ప్రస్తుతం కేసీఆర్ కు అలాంటి గతే పడుతుందన్న ఆయన.. కేసీఆర్ మహా కర్కోటకుడిగా మారారని..ఆయన తన మంత్రుల్ని డమ్మీగా మార్చారంటూ మండిపడ్డారు. అంతేకాదు.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలవాలంటే కాంగ్రెస్ తో జత కట్టాల్సిందేనన్న జోస్యాన్ని చెప్పారు.
కాంగ్రెస్ తో చంద్రబాబు కలిసి వెళితేనే.. తెలంగాణలో కేసీఆర్ ను అడ్డుకోవచ్చన్న రేవంత్.. మోడీకి కేసీఆర్ ఒక ఏజెంట్ లా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. మోడీని అడ్డుకునేందుకు బిహార్.. ఉత్తరప్రదేశ్ లలో విపక్షాలు ఎలా అయితే ఏకమయ్యాయో.. తెలంగాణలో కూడా అలానే ఏకం కావాలన్నారు. ఇప్పటివరకూ రాజకీయ వర్గాల్లో నానుతున్న చిత్రమైన కాంబినేషన్ల గురించి రేవంత్ ఓపెన్ గా మాట్లాడటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి.. రేవంత్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్.. టీడీపీలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.