Begin typing your search above and press return to search.
రేవంత్ ఎనిమిది ప్రశ్నలకు కేసీఆర్ జవాబిస్తారా?
By: Tupaki Desk | 15 Nov 2016 10:34 PM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును టీడీపీ శాసనసభా పక్ష నేత రేవంత్ రెడ్డి కొత్తగా ఇరకాటంలో పెట్టారు. రైతుల సమస్యలపై స్పందించే క్రమంలో బహిరంగ లేఖ రాసిన రేవంత్ అంతటితో ఆగకుండా కేసీఆర్ సభాముఖంగా - అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. అక్కడితో కూడా సరిపుచ్చకుండా ఏకంగా పది ప్రశ్నలు సంధించిన రేవంత్ వాటికి జవాబు ఇచ్చి రైతుల పట్ల చిత్తశుద్ధి చాటుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా కేసీఆర్ వ్యవసాయం చేస్తున్నారంటూ కితాబు ఇస్తూ మొదలు పెట్టిన రేవంత్....రైతులు అనుభవిస్తున్న కష్టనష్టాలు - వ్యవసాయంలోని అటుపోటులు రైతుగా ఆయనకు తెలియంది కాదన్నారు. అసలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం - స్వరాష్ట్ర కాంక్ష ఊపిరి పోసుకుందే తెలంగాణ రైతాంగానికి జరుగుతున్న అన్యాయాలపైనే అని రేవంత్ పేర్కొన్నారు. రైతాంగ సమస్యలే ప్రధాన ఎజెండాగా ఉద్యమానికి నాంది పలికి ఉద్యమ సమయంలోనూ, ఎన్నికల సమయంలోనూ - రైతాంగ సమస్యల పరిష్కారమే టీఆర్ ఎస్ ముందున్న అతిపెద్ద సవాల్ అంటూ(టీఆర్ ఎస్ మేనిఫెస్లో పేజి-9) 2014 ఎన్నికల మేనిఫెస్టోలోనూ రైతులకు హామీలు ఇచ్చారని వివరాలతో సహా గుర్తుచేశారు.
రైతులకు ఇచ్చిన హామీల్లో ప్రధానమైంది నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ అని తెలిపిన రేవంత్ రెడ్డి నిజాం షుగర్ ఫ్యాక్టరీనీ పునరుద్ధరించాలని టీఆర్ ఎస్ మేనిఫెస్టోలో పేజి-23లో ప్రకటించారని వివరించారు. " స్వరాష్ట్రం ఏర్పడి మీరు అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు అవుతున్నా నిజాం షుగర్స్ పై కల్లిబొల్లి మాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారు. కానీ నిజాంషుగర్స్ ను తిరిగి ప్రారంభించేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు శూన్యం. నిజాం షుగర్స్ కు చెందిన మూడు యూనిట్లు మూతపడటంతో రైతులతో పాటు వందలాది మంది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయనే విషయం మీకు కూడా తెలుసు. ప్రభుత్వామే స్వాధీనం చేసుకొని విజయవంతంగా నడుపుతుందని ఆశపడ్డ రైతులకు, కార్మికులకు స్వరాష్ట్రంలోనూ చేదు అనుభవం ఎదురైంది. పైగా నిజాం షుగర్స్ పై రోజుకో ప్రకటన చేస్తూ రైతులను, కార్మికులను తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నారు. నిజాం షుగర్స్ లేఆఫ్ ఎత్తివేయాలని డిమాండ్ చేసూ కార్మికులు రోజుల తరబడి రిలే నిరహర దీక్షలు చేస్తున్న పట్టించుకోకుండా బలవంతంగా వారిని పోలీసుల చేత అరెస్టులు చేయిస్తూ కార్మిక సంఘాల నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తు జైల్లో పెడుతున్నారు. మీరు ఇచ్చిన హామీలను మీరు కాకుండా ఎవరూ అమలు చేస్తారు. ఇప్పటికైనా మీరు రైతాంగ సమస్యలపై దృష్టి సారించి రైతాంగ సమస్యల పరిష్కారానికి సమగ్ర వ్యవసాయ విధానం తీసుకరావడంతో పాటు, నిజాం షుగర్స్ ఫ్యాక్టరీల లే ఆఫ్ ఎత్తివేయడంతోపాటు, ప్రభుత్వామే స్వాధీనం చేసుకొని నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ తెలంగాణ తరుపున డిమాండ్ చేస్తున్నాం" అంటూ ఈ ఎనిమిది ప్రశ్నలను సంధించారు.
- 2002లో నిజాం షుగర్స్ 49% ప్రభుత్వం 51% డెక్కన్ షుగర్స్ జాయింట్ వెంచర్ చేయడం జరిగితే ఒప్పందం అమలులో వైఫల్యం చెందిన ప్రైవేటు యాజమన్యంపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి. ?
- జాయింట్ వెంచర్లో ఉన్న సంస్థలను ప్రైవేటు యాజమన్యం ఏకపక్షంగా 23-122015న లే ఆఫ్ ప్రకటించే అధికారం ఉందా?
- లే ఆఫ్ ప్రకటించడంలో ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? ప్రైవేటు యాజమన్యానికే బాధ్యత అయినచో ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి.?
-టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా ప్రభుత్వపరం చేస్తామన్న ప్రభుత్వం హామీ ఏమైంది?
-ప్రభుత్వం విడుదల చేసిన జీవోనెం28 తేది: 29-04-2015 ప్రకారం ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన వేయబడిన కమిటీ నివేదిక 3 నెలలో సమర్పించాల్సి ఉండగా, ఏ దశలో ఉన్నది? ఆ నివేదికపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి.?
-దురుద్దేశపూర్వకంగా నిజాం డెక్కన్ షుగర్స్ మరియు రైతుల మధ్య జరగాల్సిన చెరకు కొనుగోలు ఒప్పందం చేయకపోవడానికి కారణాలు ఏమిటి?
-లే ఆఫ్ ప్రకటించిన అనంతరం శాశ్వత ఉద్యోగులకు ప్రభుత్వం కల్పించిన ఉద్యోగ భద్రత ఏది? లేదా చేయబడిన ప్రత్యమ్నాయలు ఏమిటి.?
- 2016-17 లేదా భవిష్యత్ ఫ్యాక్టరీల నిర్వహణలో చెరకు ప్లాంటేషన్స్ ప్రోత్సాహించడానికి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/