Begin typing your search above and press return to search.

కేసీఆర్ - కేటీఆర్ త‌ప్ప మ‌రెవ్వ‌రూ హ్యాపీగా లేర‌ట‌

By:  Tupaki Desk   |   26 Jan 2018 2:27 AM GMT
కేసీఆర్ - కేటీఆర్ త‌ప్ప మ‌రెవ్వ‌రూ హ్యాపీగా లేర‌ట‌
X
కాంగ్రెస్‌లో చేరిన కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన కేసీఆర్‌ పై దూకుడును కొన‌సాగిస్తున్నారు. అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా కేసీఆర్‌ పై మండిప‌డుతున్న రేవంత్ తాజాగా మీడియాతో చిట్‌ చాట్‌ లో ఒకింత ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో సహానీ అనే వ్యక్తికి కేసీఆర్ కేబినెట్ హోదా ఇచ్చారని..స‌హానీ ఏ రాష్ట్రం వాడో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. త‌న కుమారుడు కేటీఆర్‌ కు సేవలు చేస్తున్నందుకే సహానికి కేబినెట్ ఇచ్చారని ఆరోపించారు. కేసీఆర్ నిజమైన తెలంగాణ వాది అయితే డీలిమిటేషన్ వద్దనాలని..డీలిమిటేషన్ చేయకపోతే పోలవరం ముంపు మండలాలు తెలంగాణకు దక్కుతాయని అన్నారు.

ఈ సంద‌ర్భంగా టీఆర్ ఎస్ అంత‌ర్గ‌త రాజ‌కీయాల గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ ఎస్‌ లో చేరిన ఇతర పార్టీల నేతలకు 90శాతం వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇవ్వరని అన్నారు. టీడీపీ నుంచి వ‌చ్చిన తీగల కృష్ణారెడ్డికి ఈ సారీ టీఆరెస్ టికెట్ కట్ అని జోస్యం చెప్పారు. జనగాంలో ఎర్రబెల్లి దయాక‌ర్ రావు పోటీచేస్తారని అంచ‌నా వేశారు. `కేటీఆర్‌ కు ప్రమాదం అనుకున్న నేతలను కేసీఆర్ ఎంపీ టికెట్‌ లు ఇస్తారు. ఉప ముఖ్య‌మంత్రి కడియం శ్రీ‌హ‌రి - మంత్రులు ఈటల రాజేంద‌ర్‌ - హరీష్ రావుకు ఈ సారి ఎంపీగా పోటీచేస్తారు. టీఆర్ ఎస్‌ లో అసంతృప్తి లేనోళ్ళు కేసీఆర్ - కేటీఆర్ మాత్రమే` అని వ్యాఖ్యానించారు.

కాగా, సీనియ‌ర్ నేత నాగం జనార్ద‌న్ రెడ్డి కాంగ్రెస్‌ లో చేర‌డంపై రేవంత్ స్పందించారు. నాగం అంటే త‌నకు గౌరవం ఉంద‌న్నారు. `నాపై కేసులు పెట్టినప్పుడు నాకు నాగం ధైర్యం చెప్పారు. కష్టాల్లో ఉన్నప్పుడు పలకరించిన వారంటే నాకు గౌరవం. తెలంగాణలో టీడీపీ- కాంగ్రెస్ పోత్తుంటే పార్టీలో ఉన్న ఆ కొందరైనా ఎమ్మెల్యేలు అవుతారు. ఇప్ప‌టికే ఆ పార్టీపై సొంత నేత‌ల‌కే న‌మ్మ‌కం పోయింది` అని వ్యాఖ్యానించారు. త్రిపుల్ తలాక్ విష‌యంలో కాంగ్రెస్‌ తో కలిసి టీడీపీ పార్లమెంట్ లో సంతకం పెట్టిందని ఎన్డీయేతో టీడీపీ లేదు అన్నదానికి ఇది అద్దం పడుతుందని రేవంత్ విశ్లేషించారు.

ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పై మండిప‌డ్డారు. అమర వీరులను కట్టించలేని కేసీఆర్ ఎలా గొప్పోడో పవన్ చేప్పాలని డిమాండ్ చేశారు. `కేసీఆర్ ఇంట్లో రక్తం కారకపోతే తెలంగాణ ఉద్యమాజంలో చనిపోయిన అమర వీరుల సంగతేంటి ?? తెలంగాణ కోసం పవన్ స్థాయి కి తగ్గట్టుగా మాట్లాడలేదు. సర్కస్ చూడటానికి చాలా మంది వెళతారు. అయినంత మాత్రాన వారందరు అక్కడే ఉంటారా? ఐదు షోలకు అనుమతి కోసం వెళ్లిన పవన్ కు తెలంగాణ కష్టాలు తెలుస్తాయి అనుకోవడం భ్రమ. పవన్ ఈ టూర్‌ తో తెలంగాణ యువతలో ఉన్న హోప్ ను పోగొట్టుకున్నారు` అని ఎద్దేవా చేశారు.