Begin typing your search above and press return to search.

మైనార్టీల పార్టీ కాంగ్రెస్ నే: ‘గర్జన’లో రేవంత్

By:  Tupaki Desk   |   14 Aug 2021 5:30 PM GMT
మైనార్టీల పార్టీ కాంగ్రెస్ నే: ‘గర్జన’లో రేవంత్
X
కాంగ్రెస్ హయాంలోనే మైనార్టీలకు మేలు జరిగిందని.. నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీయే అనని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మైనార్టీ గర్జన సభలో ఆయన మైనార్టీలకు భరోసా కల్పిస్తూ మాట్లాడారు.

టీఆర్ఎస్ 'కారు'నో, ఎంఐఎం 'పతంగి'నో నమ్ముకుంటే మోసపోతారని ముస్లిం మైనార్టీలకు రేవంత్ రెడ్డి హితబోధన చేశారు. కాంగ్రెస్ హయాంలోనే మైనార్టీలకు మేలు జరిగింది, నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెసేనన్నారు. వైఎస్సార్ నేతృత్వంలో రిజర్వేషన్లు కల్పిస్తే ఎంతోమంది మైనార్టీలకు అవకాశాలు లభించాయన్నారు.

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 'దేశానికి స్వాతంత్య్రం తేవడానికి కాంగ్రెస్ ఎన్నో త్యాగాలు చేసింది. యువత ఆత్మహత్యలు చూడలేక సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. మైనార్టీలు ఒకసారి ఆలోచించాలి. రాష్ట్రపతి, ముఖ్యమంత్రి పదవులు ముస్లింలకు ఇచ్చింది కాంగ్రెస్ మాత్రమే.. కాంగ్రెస్ పార్టీ మీదే, దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీదే.. కారునే, పతంగినో నమ్ముకుంటే మోసపోయేది మీరేనంటూ' చెప్పుకొచ్చారు.

'త్రిబుల్ తలాక్, ఎన్ఆర్సీ, సీఏఏ వంటి చట్టాలను వ్యతిరేకించింది కాంగ్రెస్ మాత్రమే. కాంగ్రెస్ దగ్గర 200 మంది ఎంపీలుంటే అలంటి చట్టాలు తెచ్చే దైర్యం చేసేవారా? మోడీకి వ్యతిరేకంగా పోరాడే శక్తి ఉన్నదీ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే.. అసద్ చెప్పారనే మైనార్టీల ఓట్లు కేసీఆర్ కు వెళ్లాయి.కార్ కా స్త్రీరింగ్ అసద్ చేతిలో ఉందని చెప్పుకునే అసద్, త్రిబుల్ తలాక్ అనుకూలంగా రంజిత్ రెడ్డి యెట్లా ఓటు వేస్తారు. మైనార్టీలకు ఎవరివల్ల నష్టం జరుగుతుందో చెప్పాలనే మైనార్టీ గర్జన చేపట్టాం' అని రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ కు వేసే ఓటు బీజేపీ కి వెళ్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. దళితులకంటే కూడా ముస్లింలు వెనుకబడ్డారని.. జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు, ఇంతవరకు ఒక్కరికి కూడా మంజూరు చేయలేదని విమర్శించారు.

మైనార్టీలకు శత్రువైన కెసిఆర్ ను కొట్టాలంటే మధ్యలో అసద్ అడ్డం ఉన్నాడని రేవంత్ అన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ లు రాలేదు కానీ కేసీఆర్ కు ప్రగతి భవన్ భవంతి, కాళేశ్వరం ప్రాజెక్టు దక్కిందని ఆరోపించారు. ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూంలు ఇవ్వకపోయినా కనీసం 10 లక్షలు లోన్లయినా ఇప్పించండి , కష్టపడి పనిచేసి 12 లక్షలు కడుతామని రేవంత్ అన్నారు.

మోడీ రాక్షసుడు అయన ప్రాణం కెసిఆర్ లో ఉంది అంటూ పిట్టకథ చెప్పి మరీ రేవంత్ ఎండగట్టారు. మోడీకి మద్దతుగా నిలిచే కేసీఆర్ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చాడు. కేసిఆర్ కారును జుమ్మెరాత్ బజార్ కు పంపాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే మైనార్టీలకు విద్య, ఉపాధి అవకాశాలు వస్తాయని వివరించారు. మైనార్టీ ఓట్లతో గద్దెనెక్కిన కేసిఆర్ ప్రతి ముస్లిం కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళిత లెక్క మైనార్టీ బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.