Begin typing your search above and press return to search.
కోర్టు మాటకు తగ్గట్లే ఇంటికొచ్చిన రేవంత్
By: Tupaki Desk | 11 Jun 2015 5:48 AM GMTఓటుకు నోటు వ్యవహారంలో కెమేరా కంటికి బుక్ అయిన రేవంత్‌రెడ్డి గత కొద్దిరోజులుగా రిమాండ్‌లో ఉండటం తెలిసిందే. ఆ మధ్య విచారణలో భాగంగా ఏసీబీ కస్టడీలో మూడురోజులు ఉండటం తెలిసిందే.
కుమార్తె నిశ్చితార్థం కోసం ఏసీబీ కోర్టు రేవంత్‌కు బెయిల్ ఇవ్వటం తెలిసిందే. రెండు రోజుల పాటు బెయిల్ ఇవ్వాలని కోరితే.. కోర్టు మాత్రం కొన్ని కండీషన్ల మీద రేవంత్‌కు పన్నెండు గంటల బెయిల్ ఇచ్చింది. గురువారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రేవంత్‌కు బెయిల్ ఇస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
ఈ నేపథ్యంలో.. కోర్టు తీర్పునకు తగ్గట్లే రేవంత్‌కు చర్లపల్లి జైలు నుంచి ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తమ ప్రియతమ నాయకుడ్ని ఇంటికి వెంటబెట్టుకొని తీసుకొచ్చేందుకు ఇరవై కార్లలో కార్యకర్తలు రేవంత్‌కారును అనుసరించటం జరిగింది.
రేవంత్‌రెడ్డి కుమార్తె నిశ్చితార్థం ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వేదిక వద్ద ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకూ ఎన్ కన్వెన్షన్ వద్దనే ఉంటారని తెలుస్తోంది. కోర్టు ఆదేశాలకు తగ్గట్లే రేవంత్‌పై ఎస్కార్ట్ నిఘాను ఏర్పాటు చేశారు. కోర్టు సూచించినట్లే సాయంత్రం ఆరు గంటల కంటే కాస్త ముందే రేవంత్ చర్లపల్లికి వెళతారని చెబుతున్నారు.