Begin typing your search above and press return to search.
రాజీనామా ఆమోదిస్తే కేసీఆర్ కు చుక్కలే!
By: Tupaki Desk | 3 Nov 2017 5:14 AM GMT`తెలంగాణ సీఎం కేసీఆర్ పై పోరాటం ఆగదు. కేసీఆర్ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగించడమే నా లక్ష్యం` అంటున్నారు కాంగ్రెస్ నేత రేవంత్! ఎమ్మెల్యేగా ఉన్నా.. లేకున్నా కేసీఆర్ కు మాత్రం నిద్రపట్టనివ్వకుండానే చేస్తున్నారు! అదెలా అంటారా.. రేవంత్ రాజీనామా ఆమోదిస్తారా? లేదా? ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన చర్చ ఇది! ఒకవేళ ఆమోదిస్తే.. రేవంత్ అసలు పోరాటం అప్పుడు గాని మొదలవదంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ఫిరాయింపునేతల రాజీనామాలు స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఈ సమయం లో తానొక్కడి రాజీనామా ఆమోదిస్తే.. ఇక కేసీఆర్ ను రేవంత్ అస్సలు వదిలిపెట్టే అవకాశాలు ఉండవని చెబుతున్నారు!
కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి రాజీనామాపై అధికార టీఆర్ ఎస్ - కాంగ్రెస్ - టీడీపీ నేతల్లో చర్చ సాగుతోంది. ఆయన రాజీనామా చేస్తారా? స్పీకర్ ఆమోదిస్తారా అనే ఉత్కంఠ అందరిలో ఉంది. దీనిపై అసెంబ్లీ కార్యదర్శి వి నరసింహాచార్యులు ఓ ఇంగ్లిష్ చానల్ తో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి రాజీనామా తమకు ఇంకా అందలేదని తెలిపారు. రేవంత్ ఏపీలో రాజీనామా లేఖను ఇచ్చారు. దానిని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు ఫార్వార్డ్ చేయాలి. దానిని ఫార్వర్డ్ చేయకుంటే ఆయన మళ్లీ కొత్తగా తన రాజీనామా లేఖను స్పీకర్ కు అందిస్తారని రేవంత్ మద్దతుదారులు చెబుతున్నారు.
ఇక 2014 తర్వాత దాదాపు ముప్పై మంది ఎమ్మెల్యేల వరకు ఇతర పార్టీల నుంచి అధికార టీఆర్ ఎస్ లో చేరారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజీనామా ఆమోదిస్తే అధికార పార్టీకి కొత్త చిక్కులు తప్పకుండా వస్తాయని అంటున్నారు. రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే, దానిని స్పీకర్ ఆమోదిస్తే ఆయన మరోసారి కేసీఆర్ పైన పోరాటానికి సిద్ధమవుతారని అంటున్నారు. తన రాజీనామా ఆమోదించడాన్ని స్వాగతిస్తూనే టీఆర్ ఎస్ లో చేరిన మిగతా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని - వారి రాజీనామాలు ఆమోదించాలని డిమాండ్ చేసే అవకాశం లేకపోలేదు. తన రాజీనామా ఆమోదించి ఇతరుల రాజీనామా పెండింగులో పెడితే అవసరమైతే రేవంత్ కోర్టుకు కూడా వెళ్లే ఆలోచనలో ఉన్నారట.
తలసాని చెబుతున్నట్లు తాను రాజీనామా చేశానని, టీడీపీని విలీనం చేశామని అంటున్నారని, కానీ మిగతా వారి పరిస్థితి ఏమిటనే పాయింట్ కూడా వస్తుందని అంటున్నారు. ఏ రకంగా చూసినా కేసీఆర్ కు తలనొప్పులే అంటున్నారు. తన రాజీనామా ఆమోదిస్తే మిగతా వారి రాజీనామాలపై రేవంత్ పోరాటం ఆగదని చెబుతున్నారు. మరి ఏది ఏమైనా కేసీఆర్ కు భవిష్యత్ లో చిక్కులు తప్పవనేది మాత్రం తెలుస్తోంది!!