Begin typing your search above and press return to search.
అఫిషియల్ః టీడీపీకి రేవంత్ గుడ్ బై
By: Tupaki Desk | 28 Oct 2017 8:11 AM GMTతెలంగాణ తెలుగుదేశం పార్టీలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. టీడీపీకి రేవంత్ రెడ్డి గుడ్ బై చెప్పారు. ఇప్పటికే పార్టీ కార్యనిర్వాహక పదవి నుంచి - ఫ్లోర్ లీడర్ పోస్ట్ నుంచి రేవంత్ ను తొలగించిన నేపథ్యంలో... విజయవాడలో చంద్రబాబుతో సమావేశం అనంతరం పార్టీ ప్రాథమిక సభ్యత్వం - పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను చంద్రబాబుకు అందజేసిన అనంతరం పార్టీకి రాజీనామా చేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు.
కాగా, వారంపాటు విదేశీ పర్యటన అనంతరం లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో చంద్రబాబుతో టీ.టీడీపీ నేతలతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో తెలంగాణ టీడీపీలో వారం రోజులుగా జరుగుతున్న రేవంత్ రెడ్డి వ్యవహారంపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో కొంతమంది సీనియర్లు రేవంత్ చేస్తున్న ఆరోపణలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. రేవంత్ కాంగ్రెస్ తో వ్యవహరిస్తున్న తీరు... టీడీపీ - బీజేపీ మీటింగ్ ను సీఎం కేసీఆర్ పెట్టించారని రేవంత్ చేసిన ఆరోపణలను రమణ - చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ‘‘మనకు కాంగ్రెస్ ఎంత దూరమో... టీఆర్ ఎస్ అంతే కాదా’’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై రేవంత్ ఏమీ మాట్లాడలేదని సమాచారం. శనివారం అమరావతిలో మాట్లాడుదామని రేవంత్ కు చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. మరోసారి శనివారం విజయవాడలో భేటీ కావాలని నిర్ణయించారు.
అమరావతిలో చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలతో పాటు రేవంత్ రెడ్డి మరోసారి సమావేశం కావాలని నిర్ణయించిన ప్రకారం... ఈ సమావేశం సందర్భంగానే రేవంత్ తన పదవులకు గుడ్ బై చెప్పేశారు. ఈ పరిణామంతో రేవంత్ పయనం ఎటు సాగనుంది? అందరూ అనుకుంటున్నట్లుగానే కాంగ్రెస్ లో చేరుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.