Begin typing your search above and press return to search.
డ్రగ్స్ కేసు దర్యాప్తుపై రేవంత్ మాట విన్నారా?
By: Tupaki Desk | 14 July 2017 11:59 AM GMTభాగ్య నగరి హైదరాబాదుతో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీ టాలీవుడ్‌ను అప్రతిష్ఠ పాలు చేస్తున్న డ్రగ్స్ దందాపై ఎవరికి నచ్చినట్టుగా వారు స్పందిస్తున్నారు. వెరసి ఈ దందాతో ఎవరికి సంబంధం ఉంది? సంబంధం లేకున్నా ఇబ్బందులు పడుతున్న వారెవరు? అన్న అంశాల పట్టింపు లేకుండానే మీడియా తన వద్ద ఉన్న సమాచారంతోనే పెద్ద ఎత్తున కథనాలను వండి వార్చేస్తోంది. వెరసి గడచిన నాలుగైదు రోజులుగా ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ జరుగుతున్న తీరు మనకు తెలిసిందే. సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తల పిల్లలు, రాజకీయ నేతల కుటుంబాలకు చెందిన వారు కూడా ఈ దందాలో ఉన్నారంటూ వెలువడుతున్న కథనాల నేపథ్యంలో తెలంగాణ సర్కారు కూడా ఈ వ్యవహారంపై ఆచితూచి స్పందిస్తోందన్న వాదన లేకపోలేదు.
ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన రాకున్నా... పోలీసులనే మీడియా ముందుకు పంపిస్తున్న ప్రభుత్వ పెద్దలు... ఈ కేసు దర్యాప్తులో ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తోందని, ఎలాంటి ఆటంకాలు ఎదురు కావడం లేదని కూడా చెప్పిస్తోందన్న వాదనా లేకపోలేదు. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీ టీడీపీ ఇప్పుడు రంగంలోకి దిగిపోయింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ అసెంబ్లీలో టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. ఈ కేసును ప్రస్తావనతోనే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి... కేసును నీరు గార్చేందుకే కేసీఆర్ ప్రభుత్వం యత్నిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. కేసును నీరుగార్చే కుట్రలో భాగంగానే ప్రధాన నిందితుడు కెల్విన్ - అతడి ఇద్దరు సహాయకులను అరెస్ట్ చేయడంతో పాటు కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ ను విచారణ నుంచి తప్పిస్తున్నట్లుగా ఆయన ఆరోపించారు.
ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సబర్వాల్ ను కేసు విచారణ బాధ్యతల నుంచి తప్పిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే... సబర్వాల్ కు మంజూరు చేసిన పది రోజుల సెలవును రద్దు చేయడంతో పాటు ఈ కేసు విచారణ ప్రధానాధికారిగా సబర్వాల్ నే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వంలోని పెద్దలకు సన్నిహితులైన కొందరు సినీ ప్రముఖులను ఈ కేసు నుంచి తప్పించేందుకే అకున్ సబర్వాల్ ను సెలవుపై పంపిస్తున్నారని తెలిపారు. విచారణ జరిగే సందర్భంలోనే ఆయన సెలవుపై వెళ్లడం ఒత్తిళ్లకు నిదర్శనమని రేవంత్ రెడ్డి ఆరోపించారు.