Begin typing your search above and press return to search.
కోదండకు అండాదండా ఆయనేనా?
By: Tupaki Desk | 7 Jun 2016 10:49 AM GMTతెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) చైర్మన్ - తెలంగాణ ఉద్యమకారుడైన ప్రొఫెసర్ కోదండరాంపై టీఆరెస్ నేతలు - తెలంగాణ మంత్రులు విరుచుకుపడుతుండడంతో ఆయనకు మద్దతుగా టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి నిలిచారు. ఉద్యమ వీరుడికి తెలంగాణ మంత్రులు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. కోదండరాంను ఆంధ్రావాళ్లు కూడా ఎప్పుడూ ఇంతగా అవమానించలేదని ఆయన అన్నారు. కాగా, భూమిని నమ్ముకున్న రైతులపై తెలంగాణ సర్కార్ పడుతోందంటూ కోదండరాం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు పరిధిలోని గ్రామస్తులతో భేటీ అయిన సందర్భంలో కోదండరాం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు ఆయన్ను టార్గెట్ చేసి గ్యాప్ లేకుండా ఎదురుదాడి మొదలుపెట్టారు.
తెలంగాణ మంత్రుల మాటల దాడి నేపథ్యంలో తాజా పరిణామాలపై టీటీడీపీ నేత రేవంత్ తీవ్రంగా స్పందించారు. టీఆర్ ఎస్ నేతలు కోదండ రామ్ పై చేసిన వ్యాఖ్యల పట్ల ఆ పార్టీ అధినేత - ముఖ్యమంత్రి కేసీఆర్ వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యల పట్ల కేసీఆర్ కి స్పందిచాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. బంగారు తెలంగాణ సాధించుకోవడానికి నిర్మాణాత్మక సూచనలు చేస్తున్న ఉద్యమకారులను భయపెట్టేలా ప్రభుత్వం వ్యవహరించడం తగదని.. కోదండ రామ్ ని తిట్టిన టీఆర్ ఎస్ నేతలకు కేసీఆర్ షోకాజ్ నోటీసులివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా ఇంతవరకు కాంగ్రెస్ నేతల అండ చూసుకుని కోదండరాం కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని ఆరోపిస్తున్న టీఆరెస్ నేతలు ఇప్పుడు ఆ జాబితాలో రేవంత్ ను కూడా కలిపేశారు. అంతా కలిసి కోదండరాంను టీఆరెస్ ప్రభుత్వంపై ఎగదోస్తున్నారని ఆరోపిస్తున్నారు.