Begin typing your search above and press return to search.
నాతో ఆడుకుంటున్నారంటున్న రేవంత్
By: Tupaki Desk | 6 April 2017 9:51 AM GMTమాటల తూటాలే అస్త్రంగా తనదైన శైలిలో విరుచుకుపడే తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా కలత చెందారు. అది కూడా కేవలం తనపై వస్తున్న ఆరోపణల కారణంగానే కావడం ఆసక్తికరం. తెలంగాణలో టీడీపీ మసకబారి పోయిన నేపథ్యంలో తన దారి చూసుకొని బీజేపీలో చేరేందుకు రేవంత్ సిద్ధమైనట్లు వచ్చిన వార్తలపై ఇలా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను పార్టీ మారుతున్నానంటూ కొందరు అప్రతిష్ట పాలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. తన రాజకీయ జీవితంతో ఆడుకోవాలనుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రజల్లో ఉండి పనిచేస్తున్నా, నేను చేసేదంతా వాళ్లు గమనిస్తున్నారని వివరించారు. తెలంగాణలో టీడీపీ అభివృద్ధి కోసం మరింత కష్టపడి పనిచేస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న తాను వేరే పార్టీలోకి మారుతానని ప్రచారం చేయడం సరికాదని రేవంత్ రెడ్డి అన్నారు. ఇంత కష్టపడేది బీజేపీలో చేరడానికి కాదని, అయినా ఆ పార్టీలో చేరాల్సిన అవసరం నాకేంటీ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సర్కారును ఎదిరించి పోరాడుతున్నానని వివరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న నేపథ్యంలో తను బద్‌నామ్ చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి తీరుతానని చెప్పారు. ఏదో ఒక పార్టీలో చేరడానికి ఇంత కష్టపడాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజా సమస్యలపై సీఎం కేసీఆర్ ను - టీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలోనూ, బయటా నిలదీస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు.
సర్కారు ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు చేరవేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. రైతుల ఆత్మహత్యలు - రుణమాఫీ - విద్యార్థి ఫీజురీయింబర్స్ మెంటు - యువజన - మహిళా సమస్యలపై టీడీపీ ఉద్యమాలు చేస్తున్న సంగతి అందరికి తెలుసని రేవంత్ అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పార్టీ తరఫున ముందుండి ఆర్థిక సాయం చేశామన్నారు. కరువు - రైతు - వ్యవసాయ సంక్షోభం తదితర సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీత్‌షాను కలవాల్సిన అవసరం నాకు లేదని అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/