Begin typing your search above and press return to search.
హరీష్, కేసీఆర్ పై రేవంత్ పంచ్ లు
By: Tupaki Desk | 20 May 2017 6:36 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీటీడీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోమారు విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఆంధ్రుల తొత్తుగా మారి తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముకుంటున్నారని విమర్శించారు. ఇప్పటివరకు రాష్ట్రానికొచ్చిన నిధులను తన స్వార్థానికి వినియోగించుకుని, రైతులు, బడుగు బలహీన వర్గాలు, ఉద్యోగులను మోసం చేస్తున్నారని అన్నారు. అందుకే తెలంగాణ కోసం కార్మికులు - కర్షకులు - విద్యార్థులు చేసిన పోరాటాన్ని గోదారిలో ముంచి కుటుంబ పాలన సాగిస్తూ దోచుకుంటున్న కేసీఆర్‌ను గద్దె దింపి రాష్ట్రాన్ని కాపాడాలని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో పార్టీ నేత రాజారాం యాదవ్ చేపట్టిన రెండు రోజులు నిరాహార దీక్ష ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యతో కలిసి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.
రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్టుషాపులను ప్రోత్సహిస్తూ ఇంటికో కేసీఆర్ ను తయారు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇసుక మాఫియాతో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి కుమ్మక్కయ్యారని విమర్శించారు. బతుకమ్మ పండుగకు కోట్లు ఖర్చు చేస్తున్న సర్కారు రైతులకు మద్దతు ధరను మాత్రం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు ఇస్తానన్న మూడెకరాల భూమిని ఇవ్వకుండా కేటీఆర్ సినీ పరిశ్రమతో సంబంధాలు ఏర్పర్చుకుని అప్పనంగా భూములు అప్పగిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. మంత్రి హరీశ్‌రావు రైతులు దగ్గర ఫొటోలు దిగడమే తప్ప వారికి చేసిందేమీ లేదన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి - షకీల్ మాఫియాను ఏర్పాటు చేసుకుని ప్రజలకు దోచుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని, డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా టీఆర్ ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/