Begin typing your search above and press return to search.
కేసీఆర్ విమానంపై రేవంత్ రెడ్డి సెటైర్లు.. మామూలు కౌంటర్ కాదివి!
By: Tupaki Desk | 30 Sep 2022 11:39 AM GMTతెలంగాణలో రెండు సార్లు అధికారం సంపాదించిన కేసీఆర్ ఇప్పుడు తన నెక్ట్స్ టార్గెట్ జాతీయ రాజకీయాలు అంటూ బయలు దేరుతున్నాడు. ఇప్పటికే దసరాకు పార్టీ ప్రకటన.. కార్యాచరణ ఉంటుందని ప్రకటించాడు. కేసీఆర్ దేశ పర్యటనల కోసం ప్రత్యేకంగా ఒక చార్టెడ్ ఫ్లైట్ ను కొనుగోలు చేయాలని డిసైడ్ అయ్యాడట.. దీనికోసం 80 కోట్ల రూపాయలు ఖచ్చు చేయడం కోసం పార్టీ సిద్ధమైందట.. 12 సీట్లతో కూడిన ఈ విమానం కొనేందుకు టీఆర్ఎస్ ముఖ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు విరాళాలు ఇవ్వడానికి రెడీ అవుతున్నారట.. దసరానాడే ఈ కొత్త విమానం కోసం ఆర్డర్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్టు సమాచారం.
జాతీయ పార్టీ పెట్టడానికి సిద్ధమవుతున్న టీఆర్ఎస్ అదినేత కేసీఆర్.. కొత్త విమానం కొనుగోలు చేస్తారని తెలుస్తోంది. 12 సీట్లున్న విమానానికి రూ.100 కోట్లు వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇంత భారీ మొత్తం కోసం విరాళాలు ఇచ్చేందుకు గులాబీ నేతలు పోటీపడ్డారని.. ముగ్గురు ఖమ్మం నేతలు, ఒక కరీంనగర్ నేత, మరో నల్గొండ నేత కలిసి ఈ విమానం కోసం డబ్బులు సమకూర్చినట్టు సమాచారం.
ఇక టీఆర్ఎస్ పార్టీ వద్ద కూడా ప్రస్తుతం ఏకంగా రూ.865 కోట్ల నిధులున్నాయి. వీటిని జాతీయ స్థాయిలో సభలు, సమావేశాలు సహా పార్టీ సంబంధిత ఇతర ఖర్చుకు వెచ్చించడానికి కేసీఆర్ రెడీ అవుతున్నారు.
మరోవైపు జాతీయ పార్టీ రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఏర్పాట్లను కూడా సీఎం కేసీఆర్ ముమ్మరం చేశారు. ఈరోజు యాదాద్రి, రేపు వరంగల్ భద్రకాళి అమ్మవారి పాదాల వద్ద పెట్టి పూజలు చేయడానికి రెడీ అయ్యారు.
ఇకకేసీఆర్ జాతీయ పార్టీ కోసం సొంతంగా విమానాన్ని కొనుగోలు చేస్తున్నారన్న వార్తలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ విమానం కొనుగోలుపై సెటైర్లు వేశారు. 'దేశ దిమ్మరిలా తిరగడానికి విమానం కొంటున్నాడు' అంటూ టార్గెట్ చేశాడు. ‘అమరవీరుల కుటుంబాలను కలిసింది లేదు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఏనాడు పరామర్శించింది లేదు. ఫామ్ హౌస్ దాటింది లేదు.కానీ ఇప్పుడు దేశదిమ్మరిలా తిరగడానికి విమానం కొంటున్నారట.. ఎవని పాలయ్యిందిరో తెలంగాణ’ అని రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో అప్పుల బాధతో రైతు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని.. కొంతమంది రైతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్నా రైతు కుటుంబాలను ఏనాడు కేసీఆర్ పరామర్శించలేదని మండిపడ్డారు. ఫాంహౌస్ కు పరిమితమయ్యే కేసీఆర్ ఇప్పుడు కొత్తగా జాతీయ రాజకీయాలంటూ కొంటున్నారని రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.