Begin typing your search above and press return to search.
మద్దతు ధరపై రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
By: Tupaki Desk | 13 May 2017 10:58 AM GMTపంచ్ డైలాగులకు పెట్టింది పేరైన తెలుగుదేశం అగ్ర నేత రేవంత్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో వాగ్బాణాలు సంధించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన టార్గెట్ చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. ఖమ్మంలో నిర్వహించిన రైతు దీక్షలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ సినిమా వాళ్లకు మాత్రమే గిట్టుబాటు ధర కల్పిస్తున్నారని.. రైతులకు కాదని రేవంత్ ఎద్దేవా చేశారు. రేవంత్ ఇంకా ఏమన్నాడంటే..
‘‘రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వని కేసీఆర్.. సినిమా వాళ్లకి మాత్రం బాగానే గిట్టుబాటు ధర ఇస్తున్నారు. రుద్రమదేవి.. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలకు పన్ను మినహాయింపు ఇచ్చి.. ఇప్పుడు బాహుబలి సినిమాకు అదనపు షోలు వేసుకుని.. ఇష్టం వచ్చిన ధరకు టికెట్లు అమ్మకునే అవకాశం కల్పించారు. సినిమా వాళ్లకు ఇలా గిట్టుబాటు ధర కల్పిస్తున్న కేసీఆర్.. రైతుల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు. తెలంగాణలో పాత్రికేయ మిత్రులు రైతుల సమస్యలపై ఎందుకు వార్తలు రాయట్లేదు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ ఒక మాట అంటుంటారు. తెలంగాణను ఆంధ్రపాలకులు వెనకబడేలా చేశారు అని. మరి కేసీఆర్ చేస్తోందేంటో చెప్పాలి. కోటి ఎకరాలకు నీరు ఇస్తానన్నారు. ఇవ్వండి. కానీ రెండున్నర లక్షల ఎకరాల్లో పండిన పంటకే గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. కోటి ఎకరాలు పండిస్తే ఇక రైతుల బాధలు ఎలా ఉంటాయో? ఆ పంటలన్నింటికీ గిట్టుబాటు ధర దక్కుతుందా? పసుపు.. కందులు.. మిర్చి.. వరి.. ఇలా ఏ పంట చూసుకున్నా గిట్టుబాటు ధర దక్కట్లేదు’’ అని రేవంత్ అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/