Begin typing your search above and press return to search.

రేవంత్ కు హిమాన్ష్..బాల్క సుమన్ కు దేవాన్ష్

By:  Tupaki Desk   |   27 March 2017 11:22 AM GMT
రేవంత్ కు హిమాన్ష్..బాల్క సుమన్ కు దేవాన్ష్
X

తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని కదిపి అయిదు నిమిషాలు మాట్లాడితే చాలు అందులో నాలుగు నిమిషాలు కేసీఆర్ పై తిట్ల దండకమే ఉంటుందట. అలాంటి రేవంత్ కు కేసీఆర్ ముద్దుల మనవడు హిమాన్ష్ మాత్రం సాయం చేస్తున్నాడట. ఆశ్చర్యంగా ఉందా.. ఇదంతా రేవంత్ సరదాగా చెప్పిన కల్పిత కథే. అయితే.. రేవంత్ చెప్పిన ఆ ఫన్నీ స్టోరీకి టీఆరెస్ ఎంపీ బాల్క సుమన్ మరింత మసాలా దట్టించారు. నువ్వు మా హిమాన్షు సాయం తీసుకుంటే మేం మీ దేవాన్ష్ సాయం తీసుకుంటామంటూ ఆయన మరింత నాటకీయత పండించారు. దీంతో అక్కడున్న టీడీపీ, టీఆరెస్ నేతలంతా పడిపడీ నవ్వారట.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. తెలంగాణ అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ కు గురైన రేవంత్ రెడ్డి ఈ ఉదయం అసెంబ్లీకి వచ్చారు. అయితే ఆయన్ను ఎవరూ అడ్డుకోలేదు. లాబీల్లోకి వెళ్లిన రేవంత్ కు, ఎంపీ బాల్క సుమన్ ఎదురుపడ్డారు. సస్పెన్షన్ అమల్లో ఉండగా, ఎలా లోపలికి రానిచ్చారని సుమన్ అడుగగా, హిమాన్ష్ చెప్పడం వల్ల తనను రానిచ్చారని రేవంత్ సరదాగా అన్నారు. "నన్ను రానివ్వాలని హిమాన్ష్ వాళ్ల తాతకు చెప్పాడు కాబట్టే ఇక్కడి దాకా అనుమతించారు. మీలాంటి స్నేహితులకన్నా హిమాన్ష్ బెటర్" అని అన్నారు. దానికి వెంటనే సుమన్ కూడా బాగానే స్పందించారు. "అలాగా... మీకు హిమాన్ష్ ఉంటే, మాకు దేవాన్ష్ ఉన్నాడు" అని సుమన్ చెప్పాడు. దీంతో అక్కడున్న వారికి నవ్వాగలేదు.

అయితే.. రేవంత్ ఆ తరువాత సుమన్ పై సెటైర్ వేశారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే, ఎందుకు వెళ్లలేదని బాల్క సుమన్ ను ప్రశ్నించారు. పార్లమెంటులో ఉండాల్సిన ఎంపీ అసెంబ్లీలో కనిపిస్తున్నారంటూ సరదాగానే వ్యాఖ్యానించారు. దీంతో.. పార్టీ పనుల్లో బిజీగా ఉండటంతోనే తాను వెళ్లలేదని సుమన్ చెప్పారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/