Begin typing your search above and press return to search.
అసెంబ్లీలో రేవంత్ సీటు నెంబరు చరిత్ర తెలుసా?
By: Tupaki Desk | 30 March 2016 7:07 AM GMTకొన్ని అంశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో టీటీడీపీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డికి కేటాయించిన సీటు నెంబరు ఇప్పుడు పెద్దగా చర్చగా మారింది. మొన్నటివరకూ టీటీడీపీకి శాసనసభాపక్ష నేతగా వ్యవహరించిన ఎర్రబెల్లి.. టీఆర్ఎస్ లోకి చేరిపోవటం.. టీటీడీపీ చెందిన పలువురు ఎమ్మెల్యేలు తెలంగాణ అధికారపక్షంలోకి వెళ్లిన నేపథ్యంలో.. కొత్తగా సీట్లను కేటాయించారు. అలా కేటాయించిన నెంబర్లలో రేవంత్ రెడ్డికి ‘‘123’’ సీటు నెంబరును కేటాయించారు. ఈ నెంబరు సీటు కేటాయింపు అయిన వెంటనే.. టీడీపీకి చెందిన నేతలు గతానికి సంబంధించిన ఆసక్తికర అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.
ఈ విషయం తెలిసిన వారంతా ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే ఒక అడుగు ముందుకేసి.. చరిత్ర పునరావృతం అవుతుందా? అన్న వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఇంతకీ రేవంత్ కు కేటాయించిన 123 సీటు కథలోకి వెళ్లాలంటే.. చరిత్రలోకి తొంగి చూడాల్సిందే.
దాదాపుగా 17 ఏళ్ల క్రితం అంటే.. 1999 సంవత్సరంలో నాటి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గాన్ని కూర్చారు. ఆ కూర్పులో మంత్రి పదవి రావాల్సిన కేసీఆర్ కు రాలేదు. దీంతో.. ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టారు. ఈ పరిణామానికి అలిగిన కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయటమే కాదు.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద గళం విప్పాలని డిసైడ్ అయి.. తెలంగాణ రాష్ట్రసమితి అంటూ పార్టీని ఏర్పాటు చేశారు.
అక్కడితో ఆగకుండా తన రాజీనామాతో వచ్చిన ఉపఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీకి వచ్చారు. ఆ సందర్భంగా నాటి స్పీకర్ ప్రతిభా భారతి ఆయనకు అసెంబ్లీలో ఒక సీటు కేటాయించారు. ఆ సీటు నెంబరు.. ‘‘123’’. అలా ఆ సీట్లో కేసీఆర్ కూర్చొని తెలంగాణ ఉద్యమానికి నాందీ ప్రస్తావన చేశారు. చివరకు ఏం జరిగిందో అందరికి తెలిసిందే. కట్ చేస్తే.. తాజాగా ఎర్రబెల్లితో పాటు మరికొందరు టీటీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు తెలంగాణ అధికారపక్షం తీర్థం పుచ్చుకోవటంతో.. అసెంబ్లీలో సీట్ల కేటాయింపు మళ్లీ చేపట్టారు. తాజాగా చేసిన మార్పులతో యాదృశ్చికంగా రేవంత్ రెడ్డికి కేటాయించిన సీటు నెంబరు 123 కావటం గమనార్హం. ఈ నెంబరు సీటు కేటాయింపు జరిగిన తర్వాత కొందరు సీనియర్లు చరిత్రను.. వర్తమానాన్ని లింకెడుతూ.. భవిష్యత్తు మీద కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు.
నాడు ఏ సీట్లో అయితే కేసీఆర్ కూర్చుని తాను అనుకున్నది సాధించారో.. తాజాగా రేవంత్ రెడ్డి అదే సీట్లో కూర్చొని రాజకీయంగా తన బద్ధ శత్రువైన కేసీఆర్ మీద తాను అనుకున్నది సాధిస్తారా? అన్నది హాట్ టాపిక్ గా మారింది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తర్వాత సంగతి.. ప్రస్తుతానికైతే ఈ లింకు మాత్రం ఆసక్తికరంగా ఉందని చెప్పక తప్పదు.