Begin typing your search above and press return to search.
ప్రతిపక్షాలను ఏకం చేస్తున్న టీ స్పీకర్ డెసిషన్
By: Tupaki Desk | 5 July 2016 9:28 AM GMT తెలంగాణలో పాలక పక్షమే తప్ప ప్రతిపక్షమన్నది కనిపించకుండా చేయాలని ప్రయత్నిస్తున్న టీఆరెస్ ప్రభుత్వ ఎత్తుగడలన్నీ ఇంతవరకు ఫలిస్తూ వస్తున్నా తాజాగా కథ అడ్డం తిరిగినట్లు కనిపిస్తోంది. విపక్ష పార్టీలు దేనికవి వీక్ అయిపోయినా కూడా ఇప్పుడు ఏకమై బలపడే అవకాశాలను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ దిశగా తెలంగాణలో రాజకీయం మారుతున్నట్లు కనిపిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీసిన అధికార పార్టీ టీఆర్ ఎస్ టీ టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్యను 15 నుంచి 3 కు తగ్గించేసింది. ఇక కాంగ్రెస్ పార్టీపైనా అస్త్రాలు సంధిస్తున్న టీఆర్ ఎస్ ఆ పార్టీలోని కీలక నేతలను లాగేసుకునే యత్నం చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా మంగళవారం ఉదయం తెలంగాణ స్పీకర్ తీసుకున్న ఓ నిర్ణయం విపక్షాలన్నింటినీ ఒక్కటి చేసేసింది.
అసెంబ్లీ ప్రాంగణంలోని టీ టీడీఎల్పీకి కేటాయించిన రెండు గదులను స్పీకర్ మధుసూదనాచారి చెప్పాపెట్టకుండానే అసెంబ్లీ కమిటీలకు కేటాయించేశారు. దాంతో టీ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి తక్షణమే రియాక్ట్ అయ్యారు. స్పీకర్ చర్యలను ఖండిచిన ఆయన... తెలంగాణ సర్కారుపై పోరు సాగించేందుకు మిగతా విపక్షాలను కలుపుకోవాలని ఆలోచించారు. అనుకున్నదే తడువుగా నేరుగా సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి - బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డిలకు స్వయంగా ఆయనే ఫోన్ చేశారు. తెలంగాణ సర్కారు అవలంబిస్తున్న దమన నీతిపై పోరు సాగించేందుకు తమతో పాటు కలిసి రావాలని ఆయన వారిని కోరారు. రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ సడెన్ నిర్ణయంపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.
కాగా టీ టీడీఎల్పీ కార్యాలయం కోసం కేటాయించిన రెండు గదులను ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండానే స్పీకర్ ఇతరులకు కేటాయించడం వివాదాన్ని రేపింది. టీ టీడీఎల్పీ కార్యాలయంగా కొనసాగుతూ వస్తున్న ఆ రెండు గదులను అసెంబ్లీ కమిటీలకు కేటాయించారు. దీనిపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమకు కేటాయించిన గదులను ఇతరులకు ఎలా బదలాయిస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ఎలా స్పందించాలన్న కోణంలో రేవంత్ రెడ్డి న్యాయ నిపుణులతో సమాలోచనలు చేస్తున్నారు.
అయితే అనూహ్య రీతిలో రేవంత్ నుంచి ఫోన్ పిలుపు అందుకున్న జానారెడ్డి - కిషన్ రెడ్డిలు ఆయన పట్ల కొంత సానుకూలంగానే మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే.. రెండూ జాతీయ పార్టీలు కావడంతో తమ అధిష్ఠానాలకు ఒక మాట చెప్పి కానీ దీనిపై ఏమీ నిర్ణయం తీసుకునే పరిస్థితి వారికి లేదు. టీఆరెస్ విషయంలో బీజేపీ - కాంగ్రెస్ లు కూడా ఆగ్రహంగా ఉండడంతో ఆ పార్టీ అధిష్ఠానాల నుంచి గ్రీన్ సిగ్నల్ రావొచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే తెలంగాణలో విపక్షాలను దెబ్బతీసిన టీఆరెస్ ఇప్పుడు వారి ఉమ్మడి పోరుతో ఇబ్బందులు పడక తప్పదు.