Begin typing your search above and press return to search.
పాస్ పోర్ట్ కుంభకోణం..హరీశ్ పై సంచలన ఆరోపణలు
By: Tupaki Desk | 20 Dec 2017 7:53 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ - టీఆర్ ఎస్ పార్టీపై విమర్శలు చేయడంలో ముందుండే కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇటీవల ముఖ్యంత్రి కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ ను ఇరుకున పెట్టే కామెంట్లు రేవంత్ చేశారు. మంత్రి కేటీఆర్ మామపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. నకిలీ ఎస్టీ ధ్రువీకరణ పత్రం పెట్టి ఉద్యోగం చేశారని ఆరోపించారు. దీనికి కొనసాగింపుగా తాజాగా సీఎం కేసీఆర్ మేనల్లుడైన మంత్రి హరీశ్ రావుపై రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు.
ఇటీవల జరిగిన తెలంగాణ డీజీపీ నియమాకం వెనుక లోపాయికారి ఒప్పందం ఉందని రేవంత్ ఆరోపించారు. గతంలో పాస్ పోర్ట్ కేసులో కేసీఆర్ కుటుంబాన్ని - హరీష్ కుటుంబాన్ని పక్కనపెట్టి అప్పట్లో టీఆర్ ఎస్ లో ఉన్న సోయం బాపురావు - కాసిపేట లింగయ్యలపై కేసులు పెట్టారని రేవంత్ తెలిపారు. హరీష్ భార్య - కూతురు పేర్లమీద దొంగ పాస్ పోర్ట్ లతో గుజరాత్ మహిళలను అమెరికా పంపించారని ఆరోపించారు. ఆ పాస్ పోర్ట్ కేసులో అసలు దోషులను తప్పించినందుకు బహుమతిగా మహేందర్ రెడ్డికి డీజీపీ పదవి దక్కిందని రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు.
సినిమా వాళ్ళు పేమెంట్ ఆర్టిస్టులని రేవంత్ ఆరోపించారు. ఏ అంశంలో డబ్బులు తీసుకుంటారో వారి గురించి పొగుడుతారని ఆరోపించారు. తెలుగు సభల్లో సినిమా నటులు సహజ నటుడు కేసీఆర్ ను పొగిడారని సంచలన ఆరోపణలు చేశారు. గచ్చీబౌలీ లో రెండెకరాల ప్రభుత్వ భూమిని చిరంజీవి తన పేరిట మార్చుకున్నాడని రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. 83/1 సర్వేనెంబర్లో ఈ భూమి ఉందని రేవంత్ ఆరోపించారు. ఆ భూమిని హరీష్ రావు లీజుకు తీసుకొని ఆంధ్రా కాంట్రాక్టర్ తో కన్ స్ట్రక్షన్ ప్రారంబిస్తున్నాడని విమర్శించారు. ఆ భూమిలో పనులకు అనుమతి ఇవ్వనందుకే సోమేశ్ కుమార్ ను జీహెచ్ ఎంసి కమీషనర్ గా తప్పించారని రేవంత్ విమర్శించారు. దీనికి సంబందించిన ఆధారాలు త్వరలో బయట పెడతానని రేవంత్ తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో బీజేపీ నేతలైన లక్ష్మణ్ - కిషన్ రెడ్డిల మాటలకంటే అసదుద్దీన్ ఒవైసీ మాటకే ఎక్కువ విలువ ఇస్తాడని రేవంత్ ఆరోపించారు. కేంద్ర బీజేపీ నేతలు పదేపదే కేసీఆర్ సర్కార్ చేస్తున్న తప్పులను వదిలేసి పొగుడుతుంటే తెలంగాణలో బీజేపీ పార్టీ అవసరమా అని రేవంత్ ప్రశ్నించారు. అధికారం కోసం కేసీఆర్ ఎస్టీ లు - కులాలు వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నాడని...అందులో భాగమే లంబాడా ఆదివాసీల గొడవ అని విమర్శించారు. లంబాడాలు-ఆదివాసీల గొడవలో కాంగ్రెస్ పార్టీ అసలైన ఎస్టీ లవైపు నిలబడుతుందని పేర్కొంటూ కేటీఆర్ మామ లాంటి నకిలీ ఎస్టీల వైపు మాత్రం కాదని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ ను ఓడించాలి అనుకునే ప్రజలు కేసీఆర్ పునరేకీకరణ చేస్తున్న ప్రత్యామ్నాయం కాంగ్రెస్ వైపు నిలబడాలని కోరారు.
మిషన్ భగీరథకు కేటాయించిన యాభై వేలకోట్లల్లో ప్రభుత్వం కేవలం ఇరవై వేల కోట్లు ఖర్చు చేసిందని రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ కు తీసుకొచ్చిన గోదావరి పైపు లైన్ నుంచి గజ్వెల్ - సిద్ధిపేట లకు భగీరథ కింద నీళ్లు ఇచ్చామని కేసీఆర్ చెబుతున్నారని..అలా చేయడం వల్ల హైద్రాబాద్ ప్రజలపై వెయ్యి కోట్ల అదనపు భారం పడుతుందని రేవంత్ అన్నారు. మెట్రో వాటర్ వర్క్స్ కింద హైదరాబాద్ కు వచ్చే నీళ్ల నుంచి .. భగీరథ కింద నీళ్లు ఉచితంగా ఇవ్వడంతో హైద్రాబాద్ ప్రజలపై భారం పడుతోందని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్ట్స్ కింద నిర్మిస్తున్న రిజర్వాయర్ల నుంచి ఎందుకు తాగునీరు ఇవ్వడం లేదని, ప్రత్యేకంగా భగీరథ కిందవైపు లైన్లు ఎందుకని ఆయన ప్రశ్నించారు.