Begin typing your search above and press return to search.
కేసీఆర్ పై యనమల ఈగ వాలనివ్వడు: రేవంత్
By: Tupaki Desk | 18 Oct 2017 11:54 AM GMTతెలంగాణలో తెలుగుదేశం పార్టీ కీలక నేత - తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. టీఆర్ ఎస్ పై, కేసీఆర్ పై మండిపడే రేవంత్ కాంగ్రెస్ లో చేరుతున్నరన్న వార్త సంచలనం రేపింది. తెలంగాణలో టీఆర్ ఎస్ తో టీడీపీ కుమ్మక్కైందనే సంకేతాలు రావడంతోనే రేవంత్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పొత్తు విషయాన్ని పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు ఖండించకపోవడంతో రేవంత్ కలత చెందినట్లు సమాచారం. కేసీఆర్ ను ఎదిరించే సత్తా ఉన్న నాయకుడిగా పేరొందిన రేవంత్ కు ఆ పొత్తు ఇబ్బందికరంగా మారిందని వినికిడి. మోత్కుపల్లి నర్సింహులుతో విభేదాలు కూడా రేవంత్ పార్టీ మారడానికి ఒక కారణమని పుకార్లు వినిపిస్తున్నాయి. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి దగ్గరి బంధువైన రేవంత్ ఆయన ద్వారా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
యనమలకు కేసీఆర్ 2వేల కోట్ల కాంట్రాక్టు ఇప్పించారని - అందువల్లే కేసీఆర్ పై యనమల ఈగ కూడా వాలనివ్వడం లేదని ఎద్దేవా చేశారు. తమను జైల్లో పెట్టించిన కేసీఆర్ కు ఏపీ నేతలు అంత మర్యాద చెయ్యాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. రెండు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ .... ఈ రోజు మీడియాతో మాట్లాడారు. పరిటాల శ్రీరాం పెళ్లికి వచ్చిన కేసీఆర్ కు ఏపీ నేతలు వంగి వంగి దండాలు పెట్టారని, చంద్రబాబు వస్తే కనీసం పట్టించుకునే వారులేరని రేవంత్ విమర్శించారు. ఏపీ నేతలు అన్నం పెట్టిన వాళ్ళకే సున్నం పెడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ లో పరిటాల సునీత కొడుకు - పయ్యావుల అల్లుడి భాగస్వామ్యంతో నడుస్తున్న బార్ కు బీర్లు తయారీ చేసే కంపెనీ లైసెన్స్ ఎలా వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీ మార్పు అంశంపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఓ వైపు రేవంత్ ఏపీ టీడీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేస్తుంటే...మరోవైపు లోకేష్ మాత్రం రేవంత్ పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించారు. అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. కోర్టు పని కోసమే తాను ఢిల్లీ వెళ్లానని రేవంత్ తనకు చెప్పారని లోకేష్ అన్నారు. తమ పార్టీ నేత కంభంపాటి రామ్మోహన్ రావు...రేవంత్ ను కలిసిన విషయం తనకు తెలియదన్నారు. చంద్రబాబు ఆదేశం ప్రకారమే ఆ భేటీ జరిగిందన్న ప్రచారం ఉంది. ఏపీ టీడీపీ నేతలపై రేవంత్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుండడంతో రేవంత్ పార్టీ మారడం ఖాయమని సంకేతాలిచ్చినట్లేనని రాజకీయ విశ్లేషకుల అంచనా.