Begin typing your search above and press return to search.

కోటి నుంచి ప‌ది కోట్లు కేటీఆర్‌ కు..ఆపైన కేసీఆర్‌ కు

By:  Tupaki Desk   |   27 Aug 2018 6:00 PM GMT
కోటి నుంచి ప‌ది కోట్లు కేటీఆర్‌ కు..ఆపైన కేసీఆర్‌ కు
X
సంచ‌ల‌న విమ‌ర్శ‌లు - వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లకు పెట్టింది పేర‌యిన కాంగ్రెస్ నేత - ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మ‌రోమారు అలాంటి క‌ల‌క‌లం రేపే వ్యాఖ్య‌లే చేశారు. ఎప్ప‌ట్లాగే గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసేసిన రేవంత్ ఈ సంద‌ర్భంగా మ‌రిన్ని సంచ‌ల‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. తాము కేసీఆర్‌ కు కొన్ని ప్రశ్నలు వేశామ‌ని - త‌మ‌కోసం కాకపోయినా ప్రజల కోసమైనా...తాము లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్తారనుకున్నామ‌ని రేవంత్ అన్నారు. అయితే, వాటిని దాట‌వేశార‌ని పేర్కొన్నారు. సీఎం కుమారుడు కేటీఆర్ ముందస్తు ఎన్నికలతో న‌ష్టం ఏంట‌ని అంటున్నార‌ని అయితే లాభం ఎవ‌రికో కూడా చెప్పాల‌ని డిమాండ్ చేశారు. త‌మ బాస్‌ లు ప్రజలు అంటున్న‌ టీఆర్ ఎస్ నేత‌లు వారు 5 ఏళ్ల‌ కోసం ఓట్లేసినందున 4 సంవత్సరాల 4 నెలలకే ఎందుకు ఎన్నికలకు వెళ్తున్నారో వారికే సమాదానం చెప్పాల‌ని రేవంత్ ఎత్తిపొడిచారు.

133 ఏళ్ల‌ కాంగ్రెస్ ఎన్నో ఎన్నికలను చూసిందని ముంద‌స్తుతో త‌మ‌కేం భయమ‌ని రేవంత్ వ్యాఖ్యానించారు. ``ప్రతిపక్షంగా..ప్రజల పట్ల బాధ్యత ఉంది కాబట్టి.. మేము అడుగుతున్నాం. మీరు భయపడి ముందస్తుకు పోతున్నారు కాబట్టి.. మేము అడుగుతున్నాము` అందుకే స‌మాధానం ఇవ్వండి అని ఆయ‌న ప్ర‌శ్నించారు. `జనవరి 4 - 2019 కల్లా కొత్త ఓటర్ లిస్ట్ పెట్టనున్నట్లు సీఈసీ తెలిపింది. ముందస్తు జరగాలంటే ఎన్నికల సంఘం ఇచ్చిన కార్యాచరణ మొత్తం పక్కన పెట్టి.. పాత జాబితాతో ఎన్నికలకు వెళ్ళాలి. ప్ర‌స్తుతం ఆ అవసరం ఏమిటి? అయిన‌ప్ప‌టికీ సీఈసీ ఆదేశాలను పక్కన పెట్టి.. ముందస్తు కోసం మోడీ ముందు కేసీఆర్ మొకరిల్లుతున్నాడు`` అంటూ తన‌దైన శైలిలో దుమ్మెత్తిపోశారు. ``విభజన హామీల కోసం కేసీఆర్ ఎన్నడూ కేంద్ర మంత్రులను - ప్ర‌ధానిని కలవలేదు కానీ కేటీఆర్ - కేసీఆర్ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ వంగి - వంగి దండాలు పెడుతున్నారు. వాళ్ళ సర్వేలలో ఎక్కడ కేసీఆర్ - కేటీఆర్ ఎక్కడా ఎమ్మెల్యే గా కూడా గెలుస్తారని రాలేదు..అందుకే ముందస్తు.`` అని వ్యాఖ్యానించారు.

ఎన్నికల కోడ్ వల్ల అభివృద్ధి ఆటంకం అని బీజేపీ - తెరాస వ్యాఖ్యానించ‌డం చిత్రంగా ఉంద‌ని రేవంత్ అన్నారు. ``వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్న బీజేపీ.. ఎందుకు తెలంగాణాలో ముందస్తు కు సహకరిస్తున్నదో బీజేపీ-మోడీ సమాధానం చెప్పాలి. 1989లో ఎన్టీఆర్ - 2004 లో చంద్రబాబుకు ముందస్తు ఫలితాలు ఎలా వచ్చాయో.. కేసీఆర్ పరిస్థితి కూడా అదే ఫ‌లితాలు వ‌స్తాయి. ఒక్కసారి ఎన్నికలు నెగ్గితే ఇంత అహంభావం అవసరమా?`` అని రేవంత్ ప్ర‌శ్నించారు. కొంగర కలాన్‌ లో ప్రగతి నివేదన సభకు 25 లక్షల మంది హాజ‌రైతే రూ.500 కోట్లు ఖర్చు అవుతాయిని, వాటి వివరాలు చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. `తెలంగాణ భవన్‌ లో మీ ఎమ్మెల్యేలకు కోటి రూపాయల డబ్బా ఇచ్చారు. మీ ఎమ్మెల్యేలు ఎగబడి మీరిచ్చిన డబ్బాలు తీసుకున్నారు. మాకు పక్కా సమాచారం ఉంది. ఎన్నికల సామగ్రి డబ్బాల్లో ఇవ్వరు గొనె సంచీలలలో ఇస్తారు. కేటీఆర్ సభ కి ఇంచార్జి కాబట్టి సమాధానం చెప్పాలి.. మీరు ఎమ్మెల్యే ల కి ఇచ్చిన డబ్బా అలా లో ఎంత సామాగ్రి పడుతుందో చూపించండి. `` అని నిల‌దీశారు.

`` కేటీఆర్‌ ను కేసీఆర్ సీఎం చెయ్యలనుకుంటున్నాడు.. కానీ గాడిదకు కళ్లెం కడితే గుర్రం కాదు.. అది కేసీఆర్‌ కు తెలుసు. పంచాయ‌తీరాజ్ శాఖ ఇచ్చినా కూడా అసమర్థుడుగా ముద్ర వేసి మీరే మార్చారు కేసీఆర్.. మీకే దినాలు దగ్గర పడ్డాయి..మీ కొడుకెంత?కేసీఆర్ కుటుంబంతో డీల్ పెట్టుకోవాలంటే.. .ఒక కోటి నుంచి ప‌దికోట్ల వ‌ర‌కు కేటీఆర్‌ తో - ప‌ది కోట్లు ఆపైన డీలింగ్స్‌ కు కేసీఆర్‌ తో మాట్లాడుకోవాల‌ని జనం అనుకుంటున్నారు`` అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``కేటీఆర్ .. నువ్ అమెరికాలో బాత్రూంలు కడుక్కున్నప్పుడే నేను ఎన్నికలు పోటీ చేసిన.. అప్పుడు ఈ నాయిన చేసిన రాచ కార్యాలు దగ్గర నుండి చూసిన.సిరిసిల్లలో నువ్వు నేను చెరొక దిక్కు నుండి వస్తే ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారో చూద్దాం. నా మీద పెట్టిన కేసులు.. మీద కోర్టులు తీర్పు ఇచ్చాయి అది తెలుసుకో ముందు`` అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.