Begin typing your search above and press return to search.
కేసీఆర్ ను బెదిరించిన కేటీఆర్..అందుకే ఈ స్కెచ్
By: Tupaki Desk | 3 Sep 2018 8:05 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై సంచలన విమర్శలు - వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే కాంగ్రెస్ నేత - ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మరోమారు అదే తరహా కామెంట్లు చేశారు. ఈ దఫా తన విమర్శల దాటిని మరింత తారాస్థాయికి చేర్చి కలకలం రేపే ఆరోపణలు రేవంత్ చేశారు. సోమజిగూడాలోని ఓ హోటల్ లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ద ప్రెస్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజాం పాలన నుండి విముక్తి పొందిన తరువాత ఇప్పుడు కొంతమంది తమ చరిత్ర మాత్రమే ఉండాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రక్తం చిందించకుండా తెలంగాణ తెచ్చినం అంటున్న కేసీఆర్ కుటుంబం ఎంతమంది ఆత్మార్పణం చేసుకుంటే తెలంగాణ వచ్చిందనే విషయాన్ని ఎందుకు వెల్లడించడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కోసం 1200మంది అమరులు అయ్యారని టీఆర్ ఎస్ పార్టీ నేతలే చెప్పారనే విషయాన్ని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి వీరంతా తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించారనే విషయాన్ని ఇప్పుడు ఎందుకు మరుగున పరుస్తున్నారని ప్రశ్నించారు.
``కేసీఆర్ పార్టీ పెట్టిన 6 సంవత్సరాలకు కేటీఆర్ అమెరికా నుండి వచ్చిండు ఆ తరువాత కవిత బతుకమ్మ పేరిట దిగింది...వంటావార్పు - చిన్న పాటి ధర్నాలో పాల్గొవడం తప్ప మీరు ఉద్యమం చేసింది ఏముంది?`` అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. `మీ ఇంట్లో ఒక్కరైనా...శ్మశానానికి పోయారా?`` అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్ దృష్టిలో సామాజిక న్యాయం అంటే తమ కుటుంబ సబ్యులకు కడుపు నిండా భోజనం పెట్టడం అనుకుంటున్నాడని - తెలంగాణలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఇన్ని రోజులు ఓపిక పట్టాయని - ఇక ముందు అలా సహించబోవన్నారు. టీఆర్ ఎస్ పార్టీ ఎజెండానే ప్రజల ఎజెండాగా మార్చే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని ఆరోపించారు. 108 - ఆరోగ్యశ్రీ - నాగార్జున సాగర్ డాం - పింఛన్ - ఉచిత కరంట్ వంటివన్నీ సమైక్య పాలకులు చేసిన అభివృద్ధి పనులు కాదా అని ఆయన ప్రశ్నించారు.
నమ్మకం లేని మంత్రులు కేసీఆర్ కేబినెట్ లో కొనసాగుతున్నారని వ్యాఖ్యానించారు. ``తెలంగాణ రాగానే మేధావుల కమిటీ వేస్తానని కేసీఆర్ ఆనాడు చెప్పారు? ఇప్పుడు పౌర హక్కుల కోసం పోరాడే వ్యక్తులను అరెస్ట్ చేసే రోజులు తెలంగాణలో వచ్చాయి అంటే ఎలాంటి పాలన పాలన సాగుతోందో అర్థమవుతోంది. IAS అధికారులు కూడా మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారని ప్రభుత్వం మీద తిరుగుబావుతా ఎగురవేశారు. పత్రిక లాక్కొని జర్నలిస్టులను రోడ్డు మీద వేసిన పరిస్థితి. ఉద్యమంలో చనిపోయిన అమరులకు ఇంతవరకు న్యాయం జరగలేదు. అమరులను గుర్తించడానికి ఎందుకు 51నెలల సమయం సరిపోలేదు - ఇంతవరకు ఎందుకు గుర్తించలేదు? వెయ్యికోట్లతో ప్రగతి భవన్ - బుల్లెట్ ఫ్రూఫ్ బాత్రూమ్ నిర్మించుకున్న నువ్వు...అంబేడ్కర్ విగ్రహం - అమరవీరుల స్తూపం నిర్మించడంలో ఎందుకు ముందడుగు వేయడంలేదు?`` అని రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.
ట్రాక్టర్లతో మందు - చిందులతో నిన్న కేసీఆర్ తెలంగాణ ప్రజలపై దండయాత్ర చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌లో నిన్న వాడి వేడి తగ్గిందని - ఆత్మవిశ్వాసం తగ్గిందనేది స్పష్టమవుతోందన్నారు. ``సమైక్యవాది అయిన హరికృష్ణకు అధికార లాంచనాలతో ప్రభుత్వం అంతక్రియలు నిర్వహించింది. మరి చనిపోయిన తెలంగాణ ఉద్యమకారులకు ఆ విలువ ఎందుకు ఇవ్వలేదు? ఎన్టీఆర్ పేరును విమానాశ్రయానికి పెట్టడానికి ఒప్పుకొని కేసీఆర్.. ఆయన హరికృష్ణకు స్మారకచిహ్నం కడతా అని అన్నాడంటే ఓట్ల కోసం ఎంత దిగజారి రాజకీయం చేస్తున్నాడో అర్దం చేసుకోవచ్చు. ప్రగతి నివేదన అనే కంటే పుత్రుడి నివేదిక అనొచ్చు`` అని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్-కేటీఆర్- హరీశ్ రావు- కవిత మధ్య సమన్వయ లోపం కనిపించిందని రేవంత్ అన్నారు. కేసీఆర్ ప్రతి అరగంటకు సమాచారం తెలుసుకొనే అలవాటు అందుకే కొడుకు సభ నిర్వహణలో ఫెయిల్ అయ్యాడని గుర్తించారని వ్యాఖ్యానించారు. ``కేసీఆర్ చెప్పే పథకాలు ఆరంభ శురత్వమే. ఏమీ చేయకుండానే అన్నే చేసాను అని చెప్పుకొనే తత్వం కేసీఆర్ ది. ఇంటి ఇంటికి నల్ల ఇచ్చినట్టు నిరూపిస్తే కేసీఆర్ విధించే ఏ శిక్షకైనా సిద్దం. సంక్షేమం అంటే చివరి పేదవాడికి ప్రతీ రూపాయి అందించడమే. ఆర్థిక అభివృద్ధికి కేసీఆర్ కు ఎం సంబంధం? మిగులు బడ్జెట్ కోసం రాష్ట్రంలో నువ్వు చేసేన పని ఏదైనా ఉంటే చెప్పు? కేసీఆర్ కాలగర్భంలో కలిసిన వస్తువు వంటి వ్యక్తి. కేసీఆర్ మాటలు కాలక్షేపం కోసం మాత్రమే చూడాలి. నన్ను ముఖ్యమంత్రిని చేస్తావా లేదంటే మెత్త పెట్టి వత్తి చంపాలా అని కేటీఆర్ అంటున్నాడు. అందుకే కొడుకును మభ్యపెట్టడానికి కేసీఆర్ ముందస్తు అని హడావుడి చేస్తున్నాడు`` అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.