Begin typing your search above and press return to search.
కేసీఆర్ వెనుక మోడీ..భారీ స్కాం..కేటీఆర్ పాత్ర
By: Tupaki Desk | 5 March 2018 9:56 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రకటన అన్నివర్గాల్లోనూ ఆసక్తిని - ఆలోచనను రేకెత్తించిన సంగతి తెలిసిందే. దేశ రాజకీయాలను నిశితంగా విమర్శిస్తూ కేసీఆర్ చేసిన ఈ ప్రకటన కాంగ్రెస్ తనదైన శైలిలో స్పందించింది. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి సంచలన ఆరోపణలు చేయడంలో ముందుండే ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తాజాగా మరోమారు అలాంటి కలకలం రేపే కామెంట్లు చేశారు. కేసీఆర్ ఫ్రంట్ ప్రకటన వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారని ఆరోపించారు. అంతేకాకుండా ఈ ప్రకటన వెనుక కుంటుంబ కోణం - కుంభకోణం దాగి ఉందని రేవంత్ దుయ్యబట్టారు.
తాజాగా గాంధీ భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈఎస్ ఐ ఆసుపత్రుల కుంభకోణం - సహారా ఇండియా కంపెనీ కుంభకోణంలో సీబీఐ విచారణ జరుగుతోందని అదే ఈ ప్రకటనకు కీలకమన్నారు. `కేసీఆర్ ఢిల్లీ టూర్ లో తనపై ఉన్న సీబీఐ కేసును తప్పించాలని ఆర్థికమంత్రి అయిన అరుణ్ జైట్లీని కోరారు. ఎవ్వరూ అడగకపోయిన కేసీఆర్ తన ఆస్తులు అన్ని ఐటీ వాళ్లకు చెబుతున్నానన్నారు. బీజేపీ మాతో పొత్తు వద్దనుకుంటుంది అని ఇటీవలే చంద్రబాబునాయుడు ప్రకటన చేశారు. వెంటనే రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఆంద్రప్రదేశ్ లో ఐదారు శాతం ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్‌తో చంద్రబాబు కలుస్తారని ఇంటలిజెన్స్ నిఘా వర్గాలు కేంద్రానికి వెల్లడించాయి. కాంగ్రెస్‌కు దక్షిణాదిలో వందకు పైగా సీట్లు వచ్చే అవకాశముంటే...బీజేపీ కి 30 నుంచి 40 సీట్లు వచ్చే అవకాశముంది.ఇలాంటి సమయంలో చంద్రబాబు కూటమి కడితే బీజేపీ కి కష్టమని బీజేపీ అధిష్టానం భావించింది. అందుకే...కేసీఆర్ ను ఫ్రంట్ పేరుతో తీసుకొచ్చే ప్రయత్నం బీజేపీ చేస్తోంది.` అని రేవంత్ ఆరోపించారు. నాగపూర్ పెద్దలు వదిలిన బాణమే కేసీఆర్ అని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. `నాగపూర్ పెద్దల కీలుబొమ్మ కేసీఆర్. కుంభకోణాల నుంచి కేసీఆర్ బయట పడాలంటే చంద్రబాబు ముందరికాళ్ళకు బంధం వేయాలని సూచించారు. అందుకే మోడీకి కేసీఆర్ పరోక్షంగా సహకరిస్తున్నారు. బీజేపీని, మోడీని కాపాడడంలో భాగమే కేసీఆర్ మూడురోజుల నుంచి మాట్లాడుతున్న మాటలు. ఇందులో కుటుంబకోణం, కేసులకోణం రెండూ ఉన్నాయి` అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
కేటీఆర్‌ను సీఎం ,సంతోష్ కు రాజ్యసభ కు పంపేందుకు కేసీఆర్ విశ్వప్రయత్నం చేస్తున్నారని రేవంత్ పేర్కొన్నారు. `కేటీఆర్ తనను సీఎం చేయాలనీ కేసీఆర్‌పై ఒత్తిడి తెచ్చారు. ఈ గొడవల్లో భాగంగానే కేసీఆర్ ఇంట్లో నుండి కేటీఆర్ ఫ్యామిలి వెళ్లి మై హోంలో నివాసముంటున్నారు. ఇంట్లో థర్డ్ ఫ్రంట్ వచ్చింది కాబట్టి కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అంటున్నారు. దక్షిణాదిలో కాంగ్రెస్ ను బలహీనపర్చేందుకే ఫ్రంట్ ను బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది. థాయ్‌లాండ్ లో దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడినందుకు ఆదేశ ప్రధానికి ఐదేళ్లు శిక్షపడింది. అలాంటి శిక్షలు ఇక్కడ వేయాలంటే కేసీఆర్‌కు ఉరిశిక్ష పడుతుంది` అని రేవంత్ మండిపడ్డారు.