Begin typing your search above and press return to search.
రేవంత్ సంచలనం... కేసీఆర్ ఫ్యామిలీ దండుపాళ్యం ముఠా
By: Tupaki Desk | 7 Oct 2019 3:04 PM GMTతెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె వివాదం పతాక స్థాయికి చేరుకుందనే చెప్పాలి. నిన్నటిదాకా ప్రభుత్వం, ఆర్టీసీ కార్మిక సంఘాల మధ్య నలిగిన ఈ వివాదం... నిన్న కేసీఆర్ సంచలన నిర్ణయాల్లో ఇతర పార్టీలు కూడా ఇందులోకి దిగిపోయాయనే చెప్పాలి. టీ కాంగ్రెస్ కీలక నేత రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిలుస్తూ... సీఎం కేసీఆర్, ఆయన కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫ్యామిలీని దండుపాళ్యం ముఠాగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి... నిజంగానే పెను సంచలనం రేపారనే చెప్పాలి. తన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో ఆసక్తి చూపుతున్న కేసీఆర్... లక్ష మంది ఉద్యోగులున్న ఆర్టీసీలోని 50 వేల మంది కార్మికుల విషయంలో మాత్రం చాలా చులకన భావంతో వ్యవహరిస్తున్నారని రేవంత్ తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు.
అల్లుడు, కొడుకుకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో ఆసక్తి చూపుతున్న కేసీఆర్... 50 వేల మంది ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించేందుకు బదులుగా వేలాది మంది కార్మికులను రోడ్డున పడేసే యత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అల్లుడికి ఉద్యోగం ఇవ్వకుంటే... తన కుర్చీ కిందకు నీళ్లొస్తాయన్న భయంతో ఆరు నెలలకే అల్లుడికి మంత్రి పదవి ఇచ్చిన కేసీఆర్... ఏళ్ల తరబడి ఉద్యోగాలు చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో మాత్రం చాలా చులకన భావంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒక్క అల్లుడికే భయపడి ఆరు నెలలు తిరక్కుండానే మంత్రి పదవి ఇచ్చేసిన కేసీఆర్ కు... 50 వేల మంది కార్మికులు న్యాయ పోరాటం చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోలేకపోతున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం ఓ దండుపాళ్యం ముఠాలా తయారైందని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరిస్తే, అధికారం కోల్పోయాక ఆ పర్యవసానం అనుభవించక తప్పదని హెచ్చరించారు. టీఆర్ఎస్ నుంచి హరీశ్ రావు బయటకొస్తే ఆయనకు మద్దతు ఇస్తారా? అన్న మీడియా ప్రశ్నకు తనదైన శైలిలో స్పందించిన రేవంత్ రెడ్డి... ‘వాళ్లంతా ఒకటే.. అదో దండుపాళ్యం ముఠానే’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికులను ఎలా తొలగిస్తారో చూస్తామని కూడా రేవంత్ రెడ్డి మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు.